Watch Video: షాకిస్తోన్న ధోని కొత్త లుక్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్.. ఏం చేస్తున్నాడో తెలుసా?
Chennai Super Kings: గత ఏడాది ఆడిన ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. 2023లో ధోనీ సారథ్యంలో CSK జట్టు ఐదోసారి IPL ఛాంపియన్‌గా నిలిచింది. ధోని సీజన్ మొత్తంలో జట్టు కోసం కొన్ని అద్భుతమైన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది అభిమానులను ఎంతగానో అలరించింది. ఎంఎస్ ధోని తన కెరీర్‌లో ఇప్పటివరకు 250 IPL మ్యాచ్‌లు ఆడాడు. 218 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. అతను 38.79 సగటు, 135.92 స్ట్రైక్ రేట్‌తో 5082 పరుగులు చేశాడు.

MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో ఆకట్టుకున్నాడు. అలాగే డేంజరస్ ఫినిషర్‌గా పేరుగాంచాడు. అయితే, మైదానం వెలుపల సాధారణ జీవితాన్ని గడపుతుంటాడు. తన 42వ పుట్టినరోజున ధోనీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరలయింది. ఇందులో అతను తన పెంపుడు జంతువులతో కేక్ కట్ చేసి పుట్టినరోజు జరుపుకోవడం కనిపించింది. దీనిని చూసి అందరూ మహిని ప్రశంసించారు. అయితే, తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కెప్టెన్ ‘హుక్కా’ తాగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ పలు విధాలుగా కామెంట్లు చేస్తున్నారు.
భారత మాజీ కెప్టెన్ పొడవాటి జుట్టుతో సూట్‌లో ఈ వీడియోలో కనిపించాడు. అతని చుట్టూ కొంతమంది స్నేహితులు, బంధువులు కూడా ఉన్నారు. అయితే, CSK కెప్టెన్ హుక్కా తాగుతూ కనిపించాడు. ధోనీ ముందుగా హుక్కాను నోటిలో పెట్టుకుని పొగ పీల్చి ఆ పొగను బయటకు తీస్తూ కనిపించాడు. ధోనీకి సంబంధించిన ఈ వీడియోపై రెండు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది మహి లుక్ బాగుందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం భారత మాజీ కెప్టెన్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ఒక వినియోగదారు “మహి కోరిక” అంటూ రాసుకొచ్చాడు. మరొక వినియోగదారుడు మాత్రం “ఐపీఎల్ గెలిచినందుకు మహి భాయ్ ఇప్పటికీ పార్టీలు చేసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
2023లో ఛాంపియన్‌గా చెన్నై..
Herbal shisha hay! It’s good for health and contains no tobacco 👍🏼
Stop trolling MS Dhoni! He’s a legend. Rival fans should stay away from Mahi ❌ pic.twitter.com/F1SjaEY7ya
— Farid Khan (@_FaridKhan) January 6, 2024
గత ఏడాది ఆడిన ఐపీఎల్ 2023లో చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. 2023లో ధోనీ సారథ్యంలో CSK జట్టు ఐదోసారి IPL ఛాంపియన్‌గా నిలిచింది. ధోని సీజన్ మొత్తంలో జట్టు కోసం కొన్ని అద్భుతమైన ఫినిషింగ్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇది అభిమానులను ఎంతగానో అలరించింది.
ఇప్పటి వరకు ధోని ఐపీఎల్ కెరీర్..
ఎంఎస్ ధోని తన కెరీర్‌లో ఇప్పటివరకు 250 IPL మ్యాచ్‌లు ఆడాడు. 218 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేశాడు. అతను 38.79 సగటు, 135.92 స్ట్రైక్ రేట్‌తో 5082 పరుగులు చేశాడు. ఈ సమయంలో చెన్నై కెప్టెన్ 24 అర్ధ సెంచరీలు చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
