Ambati Rayudu: అందుకే వైసీపీకి రాజీనామా చేశా.. అసలు విషయం చెప్పేసిన క్రికెటర్‌ అంబటి రాయుడు

రాయుడి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అధికార పార్టీ నేతలు పెద్దగా ఈ విషయంపై స్పందించనప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. సీఎం జగన్‌ పోకడలు నచ్చకే పది రోజుల్లోనే రాయుడు పార్టీ వీడాడని విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు ఇదే విషయంపై స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ, సీఎం జగన్‌పై విమర్శలు చేశారు

Ambati Rayudu: అందుకే వైసీపీకి రాజీనామా చేశా.. అసలు విషయం చెప్పేసిన క్రికెటర్‌ అంబటి రాయుడు
Ambati Rayudu
Follow us
Basha Shek

|

Updated on: Jan 07, 2024 | 5:55 PM

టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. వారం రోజుల క్రితమే వైసీపీ పార్టీలో చేరిన ఆయన శనివారం (జనవరి 06) అనూహ్యంగా ఫ్యాన్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. వైఎస్సార్సీపీని వీడుతున్నానని, కొన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ట్వీట్‌ చేశాడు రాయుడు. అలాగే తన తదుపరి కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అందులో చెప్పుకొచ్చాడే. ఇప్పుడు రాయుడి రాజీనామా ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది. అధికార పార్టీ నేతలు పెద్దగా ఈ విషయంపై స్పందించనప్పటికీ ప్రతిపక్షాలు మాత్రం అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. సీఎం జగన్‌ పోకడలు నచ్చకే పది రోజుల్లోనే రాయుడు పార్టీ వీడాడని విమర్శలు చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, అచ్చెన్నాయుడు తదితరులు ఇదే విషయంపై స్పందిస్తూ వైఎస్సార్‌సీపీ, సీఎం జగన్‌పై విమర్శలు చేశారు. అలాగే రాజకీయాల్లో ఆడకుండా డకౌట్‌ అయ్యారంటూ రాయుడిపై ట్రోల్స్‌ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తన రాజీనామాపై వివరణ ఇచ్చాడీ తెలుగు క్రికెటర్‌.

‘జనవరి 20 నుంచి దుబాయ్‌ వేదికగా జరగబోయే ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో ఎంఐ (ముంబై ఇండియన్స్‌) ఎమిరేట్స్‌కు నేను ప్రాతినిథ్యం వహిస్తున్నాను. వృత్తిపరమైన క్రికెట్‌ ఆడుతున్నప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరముంది’ అని ట్వీట్‌ చేశాడు రాయుడు. గతంలో ఐపీఎల్‌ లో ముంబై ఇండియన్స్‌ తరఫున ఆడాడీ తెలుగు క్రికెటర్‌. ఇప్పుడు ఇంటర్నేషనల్‌ టీ20 లీగ్‌ లో అదే జట్టు తరఫున ఆడుతున్నట్లు ప్రకటించాడు. సో.. పొలిటికల్‌ ఇన్నింగ్స్‌కు కాస్త గ్యాప్‌ ఇచ్చి మళ్లీ బ్యాట్‌ పట్టేందుకు సిద్ధమయ్యాడన్నమాట.

ఇవి కూడా చదవండి

అందుకే రాజీనామా చేశా?

ముంబై ఇండియన్స్ తరఫున మళ్లీ బరిలోకి..

అంబటి రాయుడు ట్వీట్..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..