AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మూడు రోజుల క్రితం మూతి పళ్లు రాలిపోయాయి.. 30 కుట్లు పడ్డాయ్‌.. కట్‌ చేస్తే ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో టీంను గెలిపించాడు

క్యాండీ ఫాల్కన్స్‌ విజయంలో చమిక కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. మూడు రోజుల క్రితం క్యాచ్‌పట్టబోయి మూతి పళ్లు విరగగొట్టుకుని తీవ్రంగా గాయపడిన ఈ లంక క్రికెటర్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో క్యాండీని విజయతీరాలకు చేర్చాడు

మూడు రోజుల క్రితం మూతి పళ్లు రాలిపోయాయి.. 30 కుట్లు పడ్డాయ్‌.. కట్‌ చేస్తే ఆల్‌రౌండ్‌ ఫెర్మామెన్స్‌తో టీంను గెలిపించాడు
Chamika Karunaratne
Basha Shek
|

Updated on: Dec 11, 2022 | 2:51 PM

Share

లంక ప్రీమియర్ లీగ్‌ హోరాహోరీగా జరుగుతోంది. శనివారం (డిసెంబర్‌ 10) రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో జాఫ్నా కింగ్స్‌పై క్యాండీ ఫాల్కన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన జాఫ్నా కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 147 పరుగులు చేసింది. అనంతరం క్యాండీ ఫాల్కన్స్‌ 7 వికెట్లు కోల్పోయి చివరి బంతికి లక్ష్యాన్ని అందుకుంది. క్యాండీ ఫాల్కన్స్‌ విజయంలో చమిక కరుణరత్నే కీలక పాత్ర పోషించాడు. మూడు రోజుల క్రితం క్యాచ్‌పట్టబోయి మూతి పళ్లు విరగగొట్టుకుని తీవ్రంగా గాయపడిన ఈ లంక క్రికెటర్‌ తన ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో క్యాండీని విజయతీరాలకు చేర్చాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన క్యాండీ ఫాల్కన్స్ 100 పరుగుల లోపే 6 కీలక వికెట్లు కోల్పోయింది. ఇక జట్టుకు ఓటమితప్పదనుకున్న పరిస్థితుల్లో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కరుణరత్నే ధాటిగా ఆడాడు. కేవలం16 బంతుల్లో 162.50 స్ట్రైక్ రేట్‌తో 26 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు. అతని అజేయ ఇన్నింగ్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి.  ఈ లంక క్రికెటర్ ఇన్నింగ్స్ కారణంగా, క్యాండీ ఫాల్కన్స్ చివరి బంతికి విజయం సాధించింది.

నేను ఇప్పటికీ నవ్వగలను..

అంతకుముందు చురుకైన ఫీల్డింగ్‌తోనూ మెరుపులు మెరిపించాడు కరుణరత్నే. రెండు చక్కటి క్యాచ్‌లను అందుకుని ప్రత్యర్థిని 150 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక జాఫ్నా కింగ్స్ ఇన్నింగ్స్‌లో 31 రన్స్‌తో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అతనితో పాటు, పాకిస్థాన్‌కు చెందిన షోయబ్ మాలిక్ (28), దునిత్‌ (20) కూడా రాణించాడు. అయితే ధాటిగా ఆడుతున్న మాలిక్‌, దునిత్‌లను తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో పెవిలియన్‌ దారి పట్టించాడు చమిక. మూడు రోజుల క్రితం గాల్ గ్లాడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కరుణరత్నే తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. క్యాచ్‌ను అందుకునే ప్రయత్నంలో పట్టుతప్పిపోయి బంతి ముఖంపై పడడంతో అతని 4 పళ్లు విరిగిపోయాయి. రక్తం ధారలా కారిపోయింది. అయినా బంతిని విడిచిపెట్టలేదు. అయితే తీవ్రంగా గాయపడడంతో అతనికి సర్జరీ జరిగింది. రాలిపోయిన పళ్లను అతికించాడు. అలాగే ముఖానికి 30 కుట్లు వేశారు.

ఇవి కూడా చదవండి

‘నాలుగు పళ్లు ఉడినా తిరిగి వచ్చాయి.. మూతికి 30 కుట్టు పడ్డాయి.. అయినా నేను ఇప్పటికి నవ్వగలను. త్వరలోనే కోలుకొని తిరిగి జట్టులోకి వస్తా.. సీ యూ సూన్‌” అంటూ సందేశం పంపిన కరుణరత్నే అనుకున్నట్లే జట్టులోకి తిరిగివచ్చాడు. అద్భుత ప్రదర్శనతో జట్టును గెలిపించాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు