Team India: ఈ ఫొటోలోని క్రికెటర్లను గుర్తు పట్టారా? టీమిండియాకు ఐసీసీ కప్ తెచ్చిన హీరోలు

సెలబ్రిటీటలు కూడా తమ పుట్టిన రోజు లేదా వేరే ప్రత్యేక సందర్భాల్లో తమ చిన్ననాటి, అరుదైన ఫొటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. వీటిని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. అలా ఇప్పుడు ఇద్దరు టీమిండియా క్రికెటర్ల పాత ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది.

Team India: ఈ ఫొటోలోని క్రికెటర్లను గుర్తు పట్టారా? టీమిండియాకు ఐసీసీ కప్ తెచ్చిన హీరోలు
Team India Cricketers
Follow us

|

Updated on: Jul 14, 2024 | 8:12 AM

తమ అభిమాన హీరోలు, క్రికెటర్లు చిన్నతనంలో ఎలా ఉండేవారో చూడడానికి అభిమానులు బాగా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే సినిమా తారలు, క్రికెటర్ల పాత ఫొటోలు సోషల్ మీడియాలో తరచూ వైరలవుతుంటాయి. సెలబ్రిటీటలు కూడా తమ పుట్టిన రోజు లేదా వేరే ప్రత్యేక సందర్భాల్లో తమ చిన్ననాటి, అరుదైన ఫొటోలు వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తుంటారు. వీటిని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతుంటారు. అలా ఇప్పుడు ఇద్దరు టీమిండియా క్రికెటర్ల పాత ఫొటో ఒకటి నెట్టింట బాగా వైరల్ అవుతోంది. వీరిద్దరు తమ ధనాధన్ బ్యాటింగ్ తో భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. ముఖ్యంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ-2013 గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారీ స్టార్ క్రికెటర్లు. ఆ సిరీస్ లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన వీరు విధ్వంసక ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లకు పట్ట పగలే చుక్కలు చూపించారు. ఆ తర్వాత కూడా ఎన్నో మ్యాచుల్లో భారత్ కు శుభారంభాలు అందించారు. అయితే ఇందులో ఒకరు ప్రస్తుతం టీమిండియాలో లేడు. కానీ మరొకరు ఏకంగా భారత జట్టు సారథిగా కీలక బాధ్యతలు భుజాన మోస్తున్నాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. వీరు మరెవరో కాదు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్. వీరిద్దరూ మంచి ఫ్రెండ్. ఇది దాదాపు 15 ఏళ్ల కిందటి ఫొటో.

ఇవి కూడా చదవండి

కొన్ని రోజుల క్రితం రోహిత్ శర్మ తో కలసి తాను దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు శిఖర్ ధావన్. దీనికి మధురమైన పాత జ్ఞాపకాలు అని క్యాప్షన్ పెట్టాడు. కానీ ఎప్పుడు, ఏ సందర్భంలో దిగారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఈ ఫొటో మాత్రం క్రికెట్ అభిమానులను బాగా ఆకట్టుకుంటోంది. . దీన్ని చూసిన ఫ్యాన్స్.. ఈ ఓపెనింగ్ జోడీని చాలా మిస్ అవుతున్నామని కామెంట్లు చేస్తున్నారు.

కాగా రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు ఇటీవలే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ను గెల్చుకుంది. తద్వారా 11 ఏళ్ల తర్వాత అంటే ఛాంపియన్స్ ట్రోఫీ-2013 గెలిచిన తర్వాత మరోసారి భారత్ ఓ ఐసీసీ కప్ గెల్చుకుంది. అయితే భారత్ టీ20 వరల్డ్ కప్ గెల్చిన వెంటనే టీ 20 ఫార్మాట్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్ల గుడ్ బై చెప్పేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..