AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. మూడో టెస్ట్‌ వేదికలో కీలక మార్పు.. కారణం ఏంటంటే?

India vs Australia 3rd Test: షెడ్యూల్ ప్రకారం ధర్మశాలలో భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ, ప్రస్తుతం అక్కడి అభిమానులకు భారీ షాక్ తగిలింది.

IND vs AUS: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. మూడో టెస్ట్‌ వేదికలో కీలక మార్పు.. కారణం ఏంటంటే?
Ind Vs Aus
Venkata Chari
|

Updated on: Feb 13, 2023 | 10:38 AM

Share

భారత్, ఆస్ట్రేలియా మధ్య ధర్మశాలలో మూడో టెస్టు మ్యాచ్ జరగదని బీసీసీఐ సోమవారం స్పష్టం చేసింది. మార్చి 1 నుంచి 5 వరకు జరగాల్సిన ఈ మ్యాచ్‌ని ధర్మశాల నుంచి ఇండోర్‌కు మార్చారు. ఈ మేరకు బీసీసీఐ ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. ధర్మశాలలో మూడో టెస్టు జరగదని గతంలో వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. తాజాగా బీసీసీఐ కూడా ఈ వార్తను ధృవీకరించింది.

బీసీసీఐ క్యూరేటర్ తపోష్ ఛటర్జీ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (HPCA) స్టేడియంను సందర్శించి పిచ్, అవుట్‌ఫీల్డ్‌ను పరిశీలించారు. బోర్డుకు నివేదిక సమర్పించడకంతో.. మరుసటి రోజే నిర్ణయం తీసుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్ ఢిల్లీలో, చివరి మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది.

ఇవి కూడా చదవండి

అవుట్‌ఫీల్డ్‌తో ఇబ్బందులు..

ధర్మశాలలో చల్లటి వాతావరణం, ఔట్‌ఫీల్డ్‌లోని పరిస్థితులను చూసి తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ తెలిపింది. అవుట్‌ఫీల్డ్‌లో తగినంత గడ్డి లేదు. అందుకు ఇంకా సమయం పడుతుంది. ఈ కారణంగా, భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు ధర్మశాలలో కాకుండా ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో జరగనుంది. ధర్మశాలలో టెస్ట్ మ్యాచ్ కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే దాని పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహాయకరంగా ఉంటుంది. ఆస్ట్రేలియా తన సొంత పిచ్‌కు అనుగుణంగా ఇక్కడ పిచ్‌ను పొందాలని భావిస్తోంది. కానీ, ఇప్పుడు అది జరగదు. ధర్మశాల నుంచి మ్యాచ్‌ను మార్చడం వేలాది మంది అభిమానులను నిరాశకు గురి చేస్తుంది. ఎందుకంటే వారు చాలా కాలంగా అక్కడ వరల్డ్ క్లాస్ టెస్ట్ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!
బార్బతి కర్రీ ఇలా చేసి తింటే.. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అంతే!
కచ్చితంగా పెళ్లి చేసుకోండి.. సోక్రటిస్ చెప్పిన లాజిక్ ఇదే..
కచ్చితంగా పెళ్లి చేసుకోండి.. సోక్రటిస్ చెప్పిన లాజిక్ ఇదే..
అంబటికి బెయిల్..వైరల్ అవుతున్న అంబటి ట్విట్టర్ పోస్ట్..!!
అంబటికి బెయిల్..వైరల్ అవుతున్న అంబటి ట్విట్టర్ పోస్ట్..!!
కిలోమీటర్‌కు కేవలం రూ.2 మాత్రమే.. వందే భారత్ రైళ్లలో సౌకర్యం
కిలోమీటర్‌కు కేవలం రూ.2 మాత్రమే.. వందే భారత్ రైళ్లలో సౌకర్యం
అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా
అనౌన్స్‌మెంట్స్ ఒక్కటేనా.. ఏమైనా ఆచరిస్తారా
ఈ చిన్న గూగుల్‌ ట్రిక్‌.. పోయిన మీ ఫోన్‌ను వెతికిపెడుతుంది!
ఈ చిన్న గూగుల్‌ ట్రిక్‌.. పోయిన మీ ఫోన్‌ను వెతికిపెడుతుంది!
4 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్.. ట్విస్టుల మీద ట్విస్టులు..
4 సంవత్సరాలుగా ఓటీటీలో ట్రెండింగ్.. ట్విస్టుల మీద ట్విస్టులు..
సీక్వెల్స్ ట్రెండ్.. మీడియం రేంజ్ సినిమాలకు అదే ఆయువుపట్టు
సీక్వెల్స్ ట్రెండ్.. మీడియం రేంజ్ సినిమాలకు అదే ఆయువుపట్టు
కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే? చికిత్సతో పాటు చక్కని ఆహారం..
కీమో సైడ్‌ఎఫెక్ట్స్‌ తగ్గాలంటే? చికిత్సతో పాటు చక్కని ఆహారం..
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??
షూటింగ్ అప్‌డేట్స్.. ఏ సినిమా షూట్ ఎక్కడ జరుగుతోంది ??