AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వామ్మో మరీ ఇంత కోపమా.. స్నేక్ క్యాచర్‌కే సుస్సూ పోయించిన పాము.. వీడియో చూస్తే..

వర్షాకాలం వచ్చిందంటే చాలు.. పాములు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూనే ఉంటాయి. తాజాగా ఓ పాము ఏకంగా ట్రాక్టర్ టైర్‌కు ఉన్న రంధ్రంలో దూరి దర్జాగా పడుకుంది. ట్రాక్టర్ స్టార్ట్ చేయడంతో ఒక్కసారిగా బయటకొచ్చిన ఆ పాము.. స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Viral Video: వామ్మో మరీ ఇంత కోపమా.. స్నేక్ క్యాచర్‌కే సుస్సూ పోయించిన పాము.. వీడియో చూస్తే..
Viral Snake Video
Anand T
|

Updated on: Aug 07, 2026 | 4:17 PM

Share

సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే పాములు జనవాసాల్లోకి వస్తుంటాయి. వర్షాల కారణంగా అవి నివసించే బిలాల్లోకి నీరు చేరడంతో తమ నివాసాలను కోల్పోయి, సురక్షితమైన, వెచ్చని ప్రాంతాల కోసం జనవాసాల్లోకి వస్తుంటాయి. తాజాగా ఇలాగే గ్రామంలోకి వచ్చిన ఓ పాము ఎక్కడా స్థలం లేనట్లు రోడ్డు పక్కన పార్క్ చేసిన ట్రాక్టర్ టైర్‌లోకి దూరింది. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రంలోని బొకారోలో వెలుగు చూసింది.

ట్రాక్టర్ యజమాని వాహనాన్ని తీసేందుకు వచ్చి స్టార్ట్ చేయగా.. ఆ శబ్దానికి ఒక్కసారిగా పాము టైర్ నుంచి బయటకు వచ్చింది. అది గమనించిన స్థానికులు కేకలు వేయడంతో డ్రైవర్ ఏమైందోనని దిగి చూశాడు. టైర్ రంధ్రంలో పాము కనిపించడంతో షాకైన డ్రైవర్ వెంటనే స్థానిక స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించాడు.

సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్ క్యాచర్ పామును పట్టుకునేందుకు రంగంలోకి దిగాడు. అయితే ఆ పాము స్నేక్ క్యాచర్‌కు సైతం చుక్కలు చూపించింది. దాన్ని పట్టుకోవడానికి వెళ్లగా చాలా కోపంగా ఆయన వైపు చూస్తూ బుసలు కొట్టడం ప్రారంభించింది. సుమారు అరగంట పాటు శ్రమించి స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా, ధైర్యంగా దానిని బయటకు తీశాడు. అనంతరం దాన్ని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి వదిలేశాడు.

అక్కడే ఉన్న స్థానికులు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్లు చేస్తున్నారు.

వీడియో చూడండి..

View this post on Instagram

A post shared by AMITKANTI� (@amit_kanti_)

స్నేక్ క్యాచర్ సూచనలు:

ఈ ఘటన నేపథ్యంలో స్థానిక ప్రజలకు స్నేక్ క్యాచర్ కొన్ని సూచనలు చేశాడు. వర్షాకాలంలో పాములు తమ నివాసాలు కోల్పోయి గ్రామాల్లోకి వస్తుంటాయని.. వెచ్చదనం కోసం లారీలు, కార్ల టైర్లు, ఇంజన్ భాగాలను సురక్షిత ప్రాంతాలుగా భావించి అందులోకి దూరుతుంటాయని తెలిపాడు. గ్రామీణ ప్రాంతాల్లో వాహనాలను స్టార్ట్ చేసే ముందు లేదా ప్రయాణం ప్రారంభించే ముందు టైర్లు, ఇంజన్ కింది భాగాలను ఒకసారి చెక్ చేసుకోవాలని సూచించాడు. ఒకవేళ పాము కనిపిస్తే సొంతంగా పట్టుకోవడానికి ప్రయత్నించకుండా వెంటనే స్నేక్ రెస్క్యూయర్‌కు సమాచారం అందించాలని కోరాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
సేవింగ్స్ ఖాతాలో డబ్బు ఉందా? ఈ చిన్న ట్రిక్‌తో డబుల్ వడ్డీ!
వామ్మో మరీ ఇంత కోపమా.. స్నేక్ క్యాచర్‌కే సుస్సూ పోయించిన పాము
వామ్మో మరీ ఇంత కోపమా.. స్నేక్ క్యాచర్‌కే సుస్సూ పోయించిన పాము
TSLPRB పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్ష జీతం!
TSLPRB పోలీస్‌ శాఖలో ASI ఉద్యోగాలు.. ఎంపికైతే నెలకు రూ.లక్ష జీతం!
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగి వచ్చిన పుస్తకం.. కట్ చేస్తే..
వాళ్లు ప్రేమను తీసుకెళ్లిపోవడానికే వచ్చారు.. నర్మద మాటలకు షాకైన..
వాళ్లు ప్రేమను తీసుకెళ్లిపోవడానికే వచ్చారు.. నర్మద మాటలకు షాకైన..
కుళాయి నీరు తాగడానికి సురక్షితమేనా? 5ని ఇంట్లోనే చెక్ చేసుకోండిలా
కుళాయి నీరు తాగడానికి సురక్షితమేనా? 5ని ఇంట్లోనే చెక్ చేసుకోండిలా
300లకు పైగా సినిమాలు..స్టార్ హీరోలకు మించి క్రేజ్..!
300లకు పైగా సినిమాలు..స్టార్ హీరోలకు మించి క్రేజ్..!
రోహిత్ తిట్టిన మాటలు గుర్తుచేసుకున్న జైస్వాల్
రోహిత్ తిట్టిన మాటలు గుర్తుచేసుకున్న జైస్వాల్
ఈ సింపుల్‌ ట్రిక్‌తో సిలిండర్‌లో ఎంత గ్యాస్‌ ఉందో తెలుసుకోవచ్చు!
ఈ సింపుల్‌ ట్రిక్‌తో సిలిండర్‌లో ఎంత గ్యాస్‌ ఉందో తెలుసుకోవచ్చు!
సీఎం విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్..
సీఎం విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్..