AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 Records: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. తన రికార్డును బద్దలు కొట్టేది వైభవ్ సూర్యవంశీనేనట

T20 Records: టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కీరాన్ పొలార్డ్ 14,803 పరుగుల రికార్డును అధిగమించాడు. తన రికార్డును భవిష్యత్తులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ బద్దలు కొడతాడని బట్లర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

T20 Records: టీ20ల్లో ప్రపంచ రికార్డు.. తన రికార్డును బద్దలు కొట్టేది వైభవ్ సూర్యవంశీనేనట
Vaibhav Suryavanshi
Rakesh
|

Updated on: Aug 07, 2026 | 2:59 PM

Share

T20 Records: ఇంగ్లాండ్ దిగ్గజ బ్యాటర్ జోస్ బట్లర్ పొట్టి ఫార్మాట్ క్రికెట్‌లో అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ది హండ్రెడ్ టోర్నీలో మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ తరఫున ఆడుతున్న బట్లర్, వెల్ష్ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 20 బంతుల్లోనే నాకౌట్‌గా 51 పరుగులు చేసి విరుచుకుపడ్డాడు. ఈ మెరుపు ఇన్నింగ్స్‌తో టి20 క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. ఇప్పటివరకు వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు కీరాన్ పొలార్డ్ పేరిట ఉన్న 14,803 పరుగుల ఆల్-టైమ్ రికార్డును బట్లర్ అధిగమించాడు. ప్రస్తుతం బట్లర్ ఖాతాలో 14,833 పరుగులు ఉన్నాయి.

వైభవ్ సూర్యవంశీపై బట్లర్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఈ ప్రపంచ రికార్డు సాధించిన అనంతరం స్కాట్ స్పోర్ట్స్‌తో మాట్లాడిన జోస్ బట్లర్, తన రికార్డు భవిష్యత్తు గురించి ఆసక్తికర జోస్యం చెప్పాడు. టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలవడం చాలా గర్వంగా ఉందని, అయితే ఏదో ఒక రోజు ఎవరో ఒకరు తన రికార్డును ఖచ్చితంగా బద్దలు కొడతారని పేర్కొన్నాడు. ఆ రికార్డును తిరగరాసేది మరెవరో కాదు, భారత యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీనే అయివుంటాడని బట్లర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఒక అంతర్జాతీయ దిగ్గజం 15 ఏళ్ల భారత కుర్రాడి సామర్థ్యంపై ఈ స్థాయి విశ్వాసం వ్యక్తం చేయడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

బట్లర్ టి20 కెరీర్ గణాంకాలు

జోస్ బట్లర్ ఇప్పటివరకు తన టి20 కెరీర్‌లో 522 మ్యాచ్‌లు ఆడి 492 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేశాడు. 35.48 సగటు, 147.24 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 14,833 పరుగులు సాధించాడు. ఇందులో 9 సెంచరీలు, 106 హాఫ్ సెంచరీలు ఉండగా, అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 131 పరుగులు కావడం విశేషం. సుదీర్ఘకాలంగా వివిధ లీగ్‌లతో పాటు అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రదర్శన చేస్తూ బట్లర్ ఈ అరుదైన స్థాయికి చేరుకున్నాడు.

సంచలనాలు సృష్టిస్తున్న 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ

ఇక కేవలం 15 ఏళ్ల వయస్సులోనే కెరీర్ ప్రారంభించిన వైభవ్ సూర్యవంశీ తన మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌ను ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకోవడమే కాకుండా, జులై 2026లోనే అంతర్జాతీయ అరంగేట్రం కూడా చేశాడు. ఇప్పటివరకు తన టి20 కెరీర్‌లో 40 మ్యాచ్‌లు ఆడిన వైభవ్, 42.82 సగటు, 216.32ల భారీ స్ట్రైక్ రేట్‌తో 1,670 పరుగులు సాధించాడు. అందులో 4 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 144 పరుగులు. అతి పిన్న వయస్సులోనే సాధిస్తున్న ఈ రికార్డులే అతడిని భవిష్యత్తు సూపర్‌స్టార్‌గా నిలబెడుతున్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us