Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gautam Gambhir: ప్రధాని మోడీ పిలుపు.. శివాలయాన్ని స్వచ్ఛందంగా శుభ్రం చేసిన గౌతమ్‌ గంభీర్‌.. వీడియో

అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశంలోని అన్ని ఆలయాలు కూడా సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేవాలయాలన్నింటినీ స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని సూచించారు. ప్రధాని పిలుపును అందుకున్న ఇప్పటికే చాలామంది తమ తమ ప్రాంతాల్లోని దేవాలయాలను శుభ్రం చేస్తున్నారు.

Gautam Gambhir: ప్రధాని మోడీ పిలుపు.. శివాలయాన్ని స్వచ్ఛందంగా శుభ్రం చేసిన గౌతమ్‌ గంభీర్‌.. వీడియో
Gautam Gambhir
Follow us
Basha Shek

|

Updated on: Jan 18, 2024 | 7:47 AM

ప్రస్తుతం దేశమంతా రామనామం జపిస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 22న జరిగే ఈ మహాక్రతువు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశంలోని అన్ని ఆలయాలు కూడా సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేవాలయాలన్నింటినీ స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని సూచించారు. ప్రధాని పిలుపును అందుకున్న ఇప్పటికే చాలామంది తమ తమ ప్రాంతాల్లోని దేవాలయాలను శుభ్రం చేస్తున్నారు. అనంతరం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. ఆలయాలను క్లీనింగ్‌ చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్‌, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని శివాలయాన్ని సందర్శించిన ఆయన స్వయంగా ఆలయాన్ని క్లీన్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

స్టార్‌ క్రికెటర్‌, ఎంపీ అయి ఉండి కూడా గంభీర్‌ తన సింప్లిసిటీని చాటుకున్నారంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాలీవుడ్‌ సీనియర్‌ హీరో జాకీష్రాప్‌ కూడా రామాలయాన్ని శుభ్రం చేశారు. స్వయంగా గుడి మెట్లను క్లీన్‌ చేస్తూ కనిపించారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేవాలయాలను శుభ్రం చేసిన తర్వాత ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. సెలబ్రిటీలు స్వచ్ఛ అభియాన్‌ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.

ఇవి కూడా చదవండి

శివాలయాన్ని శుభ్రం చేస్తోన్న గౌతమ్ గంభీర్.. వీడియో..

రామాలయం మెట్లను శుభ్రం చేస్తోన్న జాకీష్రాఫ్.. వీడియో

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..