AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఇద్దరి ప్లేయర్స్‌కి ఫ్యూజులౌట్! ఇకపై టెస్టులు ఆడినోళ్లకు డబుల్ బొనాంజా.. బీసీసీఐ కీలక ప్రకటన

ఇంగ్లాండ్‌తో సిరీస్ గెలిచిన టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బంపరాఫర్ ప్రకటించింది. రెడ్ బాల్ క్రికెట్‌పై ఆటగాళ్లల్లో ఆసక్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫీజులను పెంచేందుకు సిద్దమైందని తెలుస్తోంది.

ఆ ఇద్దరి ప్లేయర్స్‌కి ఫ్యూజులౌట్! ఇకపై టెస్టులు ఆడినోళ్లకు డబుల్ బొనాంజా.. బీసీసీఐ కీలక ప్రకటన
India Vs England
Ravi Kiran
|

Updated on: Feb 28, 2024 | 1:41 PM

Share

టెస్ట్ ప్లేయర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్ అందించింది. రెడ్ బాల్ క్రికెట్‌పై ఆటగాళ్లల్లో ఆసక్తిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే మ్యాచ్ ఫీజులను పెంచేందుకు సిద్దమైందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆటగాళ్లకు బోర్డు.. ఒక టెస్టుకు రూ. 15 లక్షలు, వన్డేకు రూ. 6 లక్షలు, టీ20 మ్యాచ్‌కు రూ. 3 లక్షలు చెల్లిస్తోంది. ఇకపై టెస్టు మ్యాచ్ ఫీజును ఏకంగా రూ. 20 లక్షలకు పెంచే ఆలోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నట్టు సమాచారం. అంతేకాకుండా తగిన రివార్డులను ఆటగాళ్లకు ఇవ్వాలని చూస్తోందట. ఐపీఎల్ 2024 సీజన్ పూర్తి కాగానే.. ఈ కొత్త రెమ్యూనరేషన్లు అమలులోకి వస్తాయని సమాచారం.

సాధారణంగా ఇలాంటి నిర్ణయాలు బీసీసీఐ తీసుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. అయితే ఇంత హఠాత్తుగా ఈ మ్యాచ్ ఫీజుల అంశం తెరపైకి రావడం వెనుక ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కారణమని తెలుస్తోంది. భారత జట్టులో తిరిగి రావాలంటే.. డొమెస్టిక్ క్రికెట్‌లో ఆడాల్సిందేనని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినా.. ఈ ఇద్దరూ వాటిని భేఖాతరు చేశారు. రంజీల్లో ఆడకుండా.. పాండ్యా బ్రదర్స్‌తో కలిసి ఐపీఎల్‌కు ప్రాక్టీస్‌లో మునిగిపోయాడు ఇషాన్ కిషన్. అలాగే గాయం సాకు చూపి శ్రేయాస్ అయ్యర్ ఎన్‌సీఏలోనే ఉండిపోయాడు. దీంతో వీరిపై సీరియస్ అయిన బీసీసీఐ.. ఇకపై ఆటగాళ్లకు టెస్టులపై ఆసక్తిని పెంచేందుకు ఫీజు పెంపు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది.

కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 5 టెస్టుల సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది టీమిండియా. రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో భారత్‌కు అద్భుతమైన విజయాన్ని అందించారు యువ ప్లేయర్లు. యశస్వి జైస్వాల్, శుభ్‌మాన్ గిల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ బ్యాటింగ్‌లో అదరగొట్టగా, ఆకాష్ దీప్, కుల్దీప్ యాదవ్‌లు బౌలింగ్‌లో తమ ప్రతాపాన్ని చూపించి.. ఇంగ్లాండ్‌ ఆటగాళ్లకు చెమటలు పట్టించారు. ఈ రెండు జట్ల మధ్య ఐదో టెస్టు మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది.

ఇది చదవండి: తలపొగరు దెబ్బకు దిగింది! రీ-ఎంట్రీలో తుస్సుమన్న పాకెట్ డైనమైట్.. కేవలం 12 బంతుల్లోనే..