On This Day: క్రికెట్‌లోకి ‘కింగ్ కోహ్లీ’ ఆగమనం.. 86 బంతుల ఊచకోతకు విలవిలలాడిన ప్రత్యర్ధులు..
విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇది పరిచయం అక్కర్లేని పేరు. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రన్ మిషన్. మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీని ఆల్ టైమ్ గొప్ప బ్యాట్స్‌మెన్‌గా..

విరాట్ కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇది పరిచయం అక్కర్లేని పేరు. వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డుతో పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీల రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఈ రన్ మిషన్. మాజీ క్రికెటర్లు సైతం కోహ్లీని ఆల్ టైమ్ గొప్ప బ్యాట్స్‌మెన్‌గా అభివర్ణించారు. అయితే కోహ్లీ ఈ స్థాయికి రావడానికి కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూడాల్సి వచ్చింది. ఈ తరుణంలో క్రికెట్‌లోకి కింగ్ కోహ్లీ ఆగమనం అని చెప్పే ఇన్నింగ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. 2012 ఫిబ్రవరి 28న.. అంటే 12 సంవత్సరాల క్రితం సరిగ్గా ఈ రోజున కోహ్లీ క్రీజులో విధ్వంసం సృష్టించాడు.
భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా జట్ల మధ్య సీబీ సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా జరిగిన భారత్-శ్రీలంక మ్యాచ్‌లో కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. టీమిండియా ఈ సిరీస్ ఫైనల్‌కు చేరాలంటే.. ప్రత్యర్ధి లంక జట్టు నిర్దేశించిన టార్గెట్‌ను 40 ఓవర్లలో చేధించాలి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక.. దిల్షాన్(169), కుమార సంగక్కర(105) భారీ సెంచరీల సాయంతో నిర్ణీత 50 ఓవర్లకు నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసింది.
ఇక ఈ లక్ష్యాన్ని టీమిండియా 40 ఓవర్లలోనే సాధించాలి. ఇలాంటి అసాధ్యం కాని పనిని సుసాధ్యం చేసి చూపించాడు విరాట్ కోహ్లీ. శ్రీలంక జట్టులోని లసిత్ మలింగ, నువాన్ కులశేఖర, ఫర్వీజ్ మహరూఫ్, ఏంజెలో మాథ్యూస్ లాంటి దిగ్గజ బౌలర్లను ఓ ఆట ఆడేసుకున్నాడు. 86 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 133 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్‌లో గౌతమ్ గంభీర్ కూడా 63 పరుగులు చేసి కోహ్లీతో కలిసి 120 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కోహ్లీ తుఫాన్ ఇన్నింగ్స్ వల్ల 321 పరుగుల లక్ష్యాన్ని భారత్ 36.4 ఓవర్లలో ఛేదించి ఫైనల్‌కు చేరింది. కాగా, ప్రస్తుతం స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్ట్ సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తన భార్య అనుష్క శర్మ పండంటి మగబిడ్డకు జన్మనివ్వడంతో.. ఈ సిరీస్‌కు కోహ్లీ దూరమయ్యాడు.
ఇది చదవండి: తలపొగరు దెబ్బకు దిగింది! రీ-ఎంట్రీలో తుస్సుమన్న పాకెట్ డైనమైట్.. కేవలం 12 బంతుల్లోనే..