WPL 2024: నన్నుపెళ్లి చేసుకుంటావా? లైవ్ మ్యాచ్‌లో లేడీ క్రికెటర్‌కు ప్రపోజ్ చేసిన అభిమాని.. రిప్లై ఏంటంటే?
మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 27) గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టుకు చెందిన ఓ అందమైన క్రికెటర్ కు అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ అందింది.

మహిళల ప్రీమియర్ లీగ్ లో భాగంగా మంగళవారం (ఫిబ్రవరి 27) గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్ లో గుజరాత్ జట్టు ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ జట్టుకు చెందిన ఓ అందమైన క్రికెటర్ కు అభిమాని నుంచి పెళ్లి ప్రపోజల్ అందింది. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి ‘విల్ యూ మ్యారీ మీ’ అని రాసి ఉన్న ప్లకార్డును ప్రదర్శించాడు అభిమాని. ఈ ప్రపోజల్‌కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో స్పష్టంగా తెలియనప్పటికీ, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజి కమాధ్యమాల్లో వైరల్ గా మారాయి. బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేస్తుండగా ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న ఒక అభిమాని పెళ్లి ప్రతిపాదన చేశాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు చెందిన శ్రేయాంక పాటిల్‌కు ఈ ప్రపోజల్ అందింది. RCB టీ-షర్ట్ ధరించిన ఆ అభిమాని శ్రేయాంక పాటిల్‌కు ప్రపోజ్ చేస్తూ ప్ల కార్డ్‌ని పట్టుకుని గ్యాలరీలో కనిపించాడు. ‘విల్ యూ మ్యారీ మి.. శ్రేయాంక పాటిల్’ అని రాసి ఉన్న ప్లకార్డులో రెడ్ హార్ట్ ఫొటో కూడా ఉంది. ఈ ప్లకార్డులో అతని పేరు కన్నడలో ఉంది. అంటే ప్రపోజ్ చేసిన యువకుడు స్థానికుడే. ఈ ప్లకార్డ్ పెళ్లి ప్రపోజల్ ను చూసి బెంగళూరు జట్టు డగౌట్ లో కూర్చున్న ప్లేయర్లు నవ్వు ఆపుకోలేకపోయారు. శ్రేయాంక పాటిల్ కూడా జస్ట్ అలా క్యూట్ స్మైల్ ఇస్తూ ఉండిపోయింది.
క్రికెట్ మ్యాచ్‌లో ఇలాంటి లవ్ ప్రపోజల్స్ చాలా సార్లు జరగుతుంటాయి. ఆటగాళ్లు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడమో లేదా గ్యాలరీలో ఆడియెన్స్ ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడం తరచూ జరుగుతుంటుంది. అయితే మహిళల ప్రీమియర్ లీగ్ లో మాత్రం గ్యాలరీలోని అభిమాని గ్రౌండ్ లోని లేడీ క్రికెటర్ కు ప్రపోజ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన బెంగ ళూర్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత ఓవర్లో 7 వికెట్లకు 107 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బెంగళూరు కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. తద్వారా గుజరాత్ జెయింట్‌పై బెంగళూరు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా ఈ మ్యాచ్ లో శ్రేయంక పాటిల్ ఒకే ఓవర్ వేసి 13 పరుగులు ఇచ్చింది. అయితే ఈ ఆల్ రౌండర కు బ్యాటింగ్ చేసే అవకాశం మాత్రం రాలేదు.
శ్రేయాంక కు పెళ్లి ప్రపోజల్..
Marriage proposal for Shreyanka Patil and RCB’s players laughing in the dressing room. pic.twitter.com/yoY4e5zfxK
— CricketMAN2 (@ImTanujSingh) February 27, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








