- Telugu News Photo Gallery Cricket photos Jasprit Bumrah Might Be Played In 5th Test As Captain Against England, Rohit Sharma Rested
IND Vs ENG: కెప్టెన్‌గా బుమ్రా.. RCB ప్లేయర్ అరంగేట్రం.. ఐదో టెస్టుకు ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.!
మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు జరగనుంది. ఇక ఈ చివరి మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాంచీ విజయం అనంతరం పలువురు సీనియర్ ఆటగాళ్లకు..
Updated on: Feb 28, 2024 | 3:32 PM

మార్చి 7 నుంచి ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి టెస్టు జరగనుంది. ఇక ఈ చివరి మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనున్నట్టు తెలుస్తోంది. రాంచీ విజయం అనంతరం పలువురు సీనియర్ ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలని చూస్తోంది టీమ్ మేనేజ్‌మెంట్.

రాంచీలో జరిగిన నాలుగో టెస్టుకు ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చింది టీమ్ మేనేజ్‌మెంట్. చివరి టెస్టుకు తిరిగి బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. అలాగే ఆఖరి టెస్టులో బుమ్రా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. రోహిత్ శర్మ రెస్ట్ తీసుకోనున్నాడని సమాచారం.

అటు దేవదూత్ పడిక్కల్ టెస్టుల్లోకి అరంగేట్రం చేయనున్నాడు. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ కూడా దూరం కానున్నాడు. చివరి టెస్టుకు ఇంకా సమయం ఉండటంతో.. ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు టీమిండియా ప్లేయర్లు. వారంతా కూడా మార్చి 2న చండీగఢ్‌కు తిరిగి రానున్నారు. అలాగే టీమ్ ఇండియా, ఇంగ్లాండ్ జట్లు మార్చి 3న చార్టర్డ్ ఫ్లైట్‌లో ధర్మశాల చేరుకుంటాయి. ఇరు జట్లు ముమ్మరంగా ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నాయి.

భారత జట్టు: యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మాన్ గిల్, రజత్ పటిదార్, సర్ఫరాజ్ ఖాన్, రవీంద్ర జడేజా, ధృవ్ జురెల్(వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, దేవదత్ పడిక్కల్, శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్

ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్(కెప్టెన్), బెన్ ఫోక్స్(వికెట్ కీపర్), రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ ఆండర్సన్, షోయాబ్ బషీర్, ఆలీ రాబిన్సన్, డేనియల్ లారెన్స్, గుస్ అట్కిన్సన్




