- Telugu News Photo Gallery Cricket photos Shreyas Iyer, Ishan Kishan excluded from BCCI central contracts, Here is the 30 member list
తిక్క కుదిరింది.! సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి ఆ ఇద్దరు ఔట్.. A+ గ్రేడ్‌లో ఎవరెవరున్నారంటే?
అనుకున్నట్టుగానే జరిగింది. ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లకు షాకిచ్చింది బీసీసీఐ. రంజీల్లో ఆడమని సూచించినా వినకపోవడంతో.. 2023-24 ఏడాదికి గానూ టీమిండియా సెంట్రల్ కాంట్రాక్టుల లిస్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించింది.
Updated on: Feb 28, 2024 | 7:44 PM

అనుకున్నట్టుగానే జరిగింది. ఆ ఇద్దరు స్టార్ బ్యాటర్లకు షాకిచ్చింది బీసీసీఐ. రంజీల్లో ఆడమని సూచించినా వినకపోవడంతో.. 2023-24 ఏడాదికి గానూ టీమిండియా సెంట్రల్ కాంట్రాక్టుల లిస్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్‌ను తొలగించింది.

బీసీసీఐ ప్రకటించిన కాంట్రాక్టుల లిస్టులో A+ గ్రేడ్‌లో నలుగురు ఆటగాళ్లు ఉండగా, A గ్రేడ్‌లో ఆరుగురు ప్లేయర్స్.. B గ్రేడ్‌లో ఐదుగురు, C గ్రేడ్‌లో పదిహేను మంది క్రికెటర్లు ఉన్నారు. టీ20ల్లో దుమ్మురేపిన రింకూ సింగ్, తిలక్ వర్మలను సీ గ్రేడ్‌లో చేర్చింది బోర్డు.

ఇక, A+ గ్రేడ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు జసప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు. వీరికి ప్రతీ ఏడాది రూ.7 కోట్లు చెల్లిస్తుంది బీసీసీఐ. వీటితో పాటు మ్యాచ్ ఫీజులు, బోనస్‌లు, ప్రైజ్మనీలు అదనంగా ఉంటాయి. అలాగే ప్లేయర్లకు సంబంధించి ట్రైనింగ్ ఫెసిలిటీస్, మెడికల్ సపోర్ట్, ట్రావెల్ అలవెన్స్‌లను బోర్డు భరిస్తుంది.

గ్రేడ్-ఏలో అశ్విన్, షమీ, సిరాజ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఉండగా.. వీరికి బోర్డు సంవత్సరానికి రూ.5 కోట్లు చెల్లిస్తుంది. ఇక గ్రేడ్ బీలో ఉన్న సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్‌కు ఏడాదికి రూ.3 కోట్లు అందనున్నాయి.

గ్రేడ్ సీలో ఉన్న రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శార్దూల్ ఠాకూర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్, ప్రసిద్ధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, రజత్ పటిదార్‌కు రూ.1 కోటి చొప్పున బీసీసీఐ చెల్లించనుంది.




