- Telugu News Photo Gallery Cricket photos From Shikhar Dhawan to Cheteshwar Pujara These 5 Big Players International Career Career Seems To Come At End After BCCI Central Contracts
BCCI Central Contracts: సెంట్రల్ కాంట్రక్ట్ ఎఫెక్ట్.. రిటైర్మెంట్ బాటలో ఐదుగురు టీమిండియా క్రికెటర్లు.. ఎవరంటే?
BCCI Central Contracts: బీసీసీఐ తన కొత్త వార్షిక ఒప్పందాన్ని ప్రకటించింది. 11 మంది యువ ముఖాలు ఈ డీల్‌లో చేరగా, కొంతమంది వెటరన్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేరడంలో విఫలమయ్యారు. వారిలో ప్రముఖులైన ఈ ఐదుగురు ఆటగాళ్ల కెరీర్ పాక్షికంగా ముగిసినట్లేనని తెలుస్తోంది.
Updated on: Feb 29, 2024 | 10:07 AM

బీసీసీఐ తన కొత్త వార్షిక ఒప్పందాన్ని ప్రకటించింది. 11 మంది యువ ముఖాలు ఈ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేరగా, కొంతమంది వెటరన్ ఆటగాళ్లు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో చేరడంలో విఫలమయ్యారు. వారిలో ప్రముఖులైన ఈ ఐదుగురు ఆటగాళ్ల కెరీర్ పాక్షికంగా ముగిసినట్లేనని తెలుస్తోంది. ఈ లిస్టుతో వీరు ఇక రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

శిఖర్ ధావన్: డిసెంబర్ 2022లో టీమ్ ఇండియా తరపున తన చివరి మ్యాచ్ ఆడిన శిఖర్ ధావన్‌ను కూడా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి BCCI మినహాయించింది. ప్రస్తుతం ధావన్ ఏ రూపంలోనూ జట్టులో లేడు. ఇప్పుడు ఆయన తిరిగి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను టీమ్ ఇండియాలో పునరాగమనం చేయగలడా లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఛెతేశ్వర్ పుజారా: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్ తర్వాత పుజారా టీమ్ ఇండియాలో కనిపించలేదు. అయితే, ఈ మధ్య దేశవాళీ క్రికెట్‌లో పుజారా మంచి ప్రదర్శన చేశాడు. అయితే బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అతడిని తప్పించారు. దీంతో పుజారా కెరీర్ ముగిసిందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అజింక్యా రహానే: జట్టు మాజీ వైస్ కెప్టెన్ అజింక్యా రహానే కూడా ఈ ఒప్పందంలో భాగం కాదు. గతేడాది ఐపీఎల్ తర్వాత భారత జట్టులో చోటు దక్కించుకున్న రహానే.. 2023 డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆడాడు. ఆ తర్వాత వెస్టిండీస్ పర్యటనకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అయితే, దీని తర్వాత అకస్మాత్తుగా జట్టుకు దూరమైన రహానే రంజీల్లో కూడా బలహీనంగా ఉండటంతో ఇప్పుడు అతడిని కాంట్రాక్ట్ నుంచి తప్పించారు.

ఉమేష్ యాదవ్: భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా భారత జట్టులో స్థానం కోసం చాలా కాలంగా పోరాడుతున్నాడు. పుజారా, రహానెల మాదిరిగానే అతను కూడా మునుపటి ఒప్పందంలో భాగమయ్యాడు. అయితే, ఇప్పుడు కొత్త కాంట్రాక్ట్‌లో వారికి చోటు దక్కలేదు. ఇప్పుడు అతని పునరాగమనంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇషాంత్ శర్మ: మరో భారత ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఈ కేంద్ర ఒప్పందంలో భాగం కాదు. గత రెండేళ్లుగా అతను జట్టులో కూడా లేరు. కాబట్టి ఇషాంత్ కెరీర్‌కు బ్రేక్ పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.




