Team India: టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?

ప్రతిష్ఠాత్మక అండర 19 మహిళల T20 ప్రపంచ కప్‌ను భారత జట్టు గెలవడం ఇది రెండో సారి. ఇంతకు ముందు 2023లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లోనూ షఫాలీ వర్మ నేతృత్వంలోని అండర్-19 మహిళల జట్టు తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఇప్పుడు వరుసగా రెండోసారి టీమ్ ఇండియా ఛాంపియన్‌గా నిలిచింది.

Team India: టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు బీసీసీఐ భారీ నజరానా.. ఎన్ని కోట్లంటే?
Team India
Follow us
Basha Shek

|

Updated on: Feb 03, 2025 | 10:27 AM

ప్రతిష్ఠాత్మక ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ను భారత జట్టు రెండోసారి గెల్చుకుంది. కౌలాలంపూర్‌లోని బయుమాస్ ఓవల్ మైదానంలో జరిగిన అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై భారత్ విజయం సాధించి 2వ సారి ప్రపంచ కిరీటాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత అమ్మాయిలపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు కూడా భారత మహిళల క్రికెట్ జట్టుకు రూ. 5 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. ఈ నగదు బహుమతిని క్రీడాకారులు, సిబ్బంది పంచుకోనున్నారు. ఇక ప్రపంచకప్ ఫైనల్ లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా అండర్-19 మహిళల జట్టు 20 ఓవర్లలో 82 పరుగులు చేసి ఆలౌటైంది. టీమ్ ఇండియా తరఫున గొంగడి త్రిష 3 వికెట్లతో మెరిసింది. అలాగే పరుణికా సిసోడియా, ఆయుషి శుక్లా, వైష్ణవి శర్మ తలా 2 వికెట్లు తీశారు. 83 పరుగుల సులువైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాలో గొంగడి త్రిష 33 బంతుల్లో అజేయంగా 44 పరుగులు చేయగా, సానికా చాల్కే అజేయంగా 26 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 11.2 ఓవర్లలో 84 పరుగులు చేసి 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కాగా ఐసీసీ ఈవెంట్‌లో గెలిచిన ప్రతి జట్టుకు ఐసిసి డబ్బు రూపంలో రివార్డ్ ఇస్తుంది. అయితే అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ నుంచి ఎలాంటి రివార్డు లభించదు. ఐసీసీ ప్రోటోకాల్ ప్రకారం అండర్-19 స్థాయిలో ప్రపంచ కప్‌ విజేతలకు ఎలాంటి ప్రైజ్ మనీ లభించలేదు. ఎన్నో ఏళ్లుగా జరుగుతున్న అండర్-19 పురుషుల ప్రపంచకప్‌లో కూడా విజేత జట్టుకు డబ్బు రూపంలో ఎలాంటి బహుమతి ఇవ్వలేదు. ఆటగాళ్లకు పతకాలతోపాటు ట్రోఫీలు మాత్రమే అందజేస్తారు.అందులో భాగంగానే ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన భారత మహిళల జట్టుకు ఐసీసీ చైర్మన్ జైషా ప్రపంచకప్ ట్రోఫీని అందించారు. అందరికీ పతకాలు అందజేశారు. అయితే బీసీసీఐ మాత్రం భారత మహిళల జట్టుకు భారీ నజరానా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..