Team India: బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం.. హోటల్ గదుల్లోనే భారత ఆటగాళ్లు.. జైషా కీలక నిర్ణయం..

Barbados Weather Update: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది. బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్‌పోర్టు ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్‌ నుంచి బయట పడేసేందుకు ప్లాన్ వేసింది.

Team India: బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం.. హోటల్ గదుల్లోనే భారత ఆటగాళ్లు.. జైషా కీలక నిర్ణయం..
Team India In Barbodos
Follow us

|

Updated on: Jul 02, 2024 | 7:26 AM

Barbados Weather Update: టీ20 ప్రపంచకప్ గెలిచిన తర్వాత టీమిండియా కష్టాల్లో పడింది. బార్బడోస్‌లో తుఫాన్ బీభత్సం చేస్తోంది. దీని కారణంగా టీమిండియాలోని ప్రతి సభ్యుడు ఇప్పటికీ అక్కడే చిక్కుకుపోయారు. బార్బడోస్‌లో తుఫాన్ కారణంగా, విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోయింది. విమానాశ్రయాలు కూడా మూసివేశారు. ఎయిర్‌పోర్టు ఎప్పుడు తెరుచుకుంటుంది అనేది ఇంకా ఎవరికీ తెలియదు. అయితే ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు బీసీసీఐ తన జట్టును ఈ తుఫాన్‌ నుంచి బయటపడేసేందుకు ప్లాన్ వేసింది. ఛార్టర్డ్ ఫ్లైట్ ద్వారా టీమ్ ఇండియాను భారత్‌కు రప్పించేందుకు జై షా ప్లాన్ చేసినట్లు సమాచారం.

తుఫాన్ నుంచి టీమిండియాను బీసీసీఐ ఎలా కాపాడుతుంది?

బీసీసీఐ సెక్రటరీ జై షా మీడియాతో మాట్లాడుతూ.. ఆటగాళ్లను, భారత మీడియా ప్రతినిధులను సురక్షితంగా తరలించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. సోమవారం బార్బడోస్ నుంచి చార్టర్డ్ విమానంలో బయలుదేరేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తోందని, అయితే విమానాశ్రయం మూసివేయడం వల్ల ఈ అవకాశం కోల్పోయిందని జే షా తెలియజేశారు. చార్టర్డ్ విమానాలను నడుపుతున్న కంపెనీలతో బోర్డు టచ్‌లో ఉందని, బార్బడోస్ విమానాశ్రయం తెరిచిన వెంటనే, బృందం అమెరికా లేదా యూరప్‌కు వెళ్తుందని జై షా తెలియజేశారు.

మంగళవారం కూడా బార్బడోస్ వదిలి వెళ్లడం కష్టం..!

మంగళవారం కూడా బార్బడోస్‌ను వదిలి వెళ్లడం టీమిండియాకు కష్టంగా ఉంది. ఎందుకంటే, అక్కడ తుఫాన్ పరిస్థితి ఇప్పటికీ అలాగే ఉంది. ఎయిర్‌పోర్టు అధికారులతో బీసీసీఐ టచ్‌లో ఉందని జే షా మీడియాకు తెలిపారు. విమానాశ్రయం పనిచేయడం ప్రారంభించిన వెంటనే, టీమిండియా చార్టర్డ్ విమానంలో అమెరికా లేదా యూరప్‌కు వెళ్తుంది. దీని తర్వాత అక్కడి నుంచి టీమిండియా భారత్‌కు రానుంది. అయితే, గాలి వేగం తగ్గినప్పుడే ఇదంతా సాధ్యమవుతుందని జై షా అన్నారు. ప్రకృతితో పోరాడాలని ఎవరూ కోరుకోరని, అందుకే వేచి ఉండటమే మంచిదని జై షా అన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
ఎల్‌కే అద్వానీకి తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
పిఠాపురంలో 3 ఎకరాలు కొన్నా.. ఇక నుంచి ఇదే నా ఇల్లు
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
కల్కి పార్ట్ 2లో ప్రభాస్ క్యారెక్టర్ రివీల్ చేసిన నాగ్ అశ్విన్..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
గ్యాస్‌ నొప్పిని చిటికెలో మాయం చేసే అద్భుత చిట్కా..
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
పవన్ కళ్యాణ్ సినిమాతో తెలుగులో ఎంట్రీ.. వరుస హిట్స్ అందుకున్న తార
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
శ్రీపాద వల్లభుడి సాక్షిగా ప్రజలకు రుణపడి ఉంటాః పవన్
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
రోజూ ఓ కప్పు కాఫీ తాగితే.. అమేజింగ్ అంతే! ఆ సమస్యకు అమృతం లాంటిది
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
వందేభారత్‌ వర్షపు నీరు..వీడియో వైరల్‌.. రైల్వే ఏం చెప్పిందంటే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
ఏపీపీఎస్సీ గ్రూప్‌ 2 మెయిన్స్‌ పరీక్ష వాయిదా! కారణం ఇదే..
బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్..!
బీకేర్‌ఫుల్.! గోల్‌గప్పతో క్యాన్సర్ వచ్చే ఛాన్స్..!