AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ బుడ్డోడు ఎవర్రా సామీ.. 35 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ ప్రపంచ రికార్డ్‌ జస్ట్ మిస్సంతే..

Bangladesh A vs Hong Kong, Asia Cup Rising Stars 2025: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ మూడో మ్యాచ్‌లో, బంగ్లాదేశ్ ఏ ఓపెనర్ హబీబుర్ రెహమాన్ సోహన్ కేవలం 35 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. హాంకాంగ్‌పై తన జట్టును విజయపథంలో నడిపించాడు.

ఈ బుడ్డోడు ఎవర్రా సామీ.. 35 బంతుల్లోనే సెంచరీ.. వైభవ్ ప్రపంచ రికార్డ్‌ జస్ట్ మిస్సంతే..
Habibur Rahman Sohan
Venkata Chari
|

Updated on: Nov 15, 2025 | 3:52 PM

Share

Habibur Rahman Sohan: దోహాలో జరుగుతున్న ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నమెంట్‌లో తుఫాన్ సెంచరీలు నమోదు కావడంతో బౌలర్ల కెరీర్ ఆరంభంలోనే ఆగమాగం అవుతోంది. వైభవ్ సూర్యవంశీ తర్వాత, ఇప్పుడు బంగ్లాదేశ్ ఎ ఓపెనర్ హబీబుర్ రెహమాన్ సోహన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. సోహన్ హాంకాంగ్ జట్టుపై ఈ సెంచరీ సాధించి బంగ్లాదేశ్ ఎ జట్టును 8 వికెట్ల తేడాతో విజయతీరాలకు చేర్చాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. దానికి సమాధానంగా బంగ్లాదేశ్ ఎ కేవలం 11 ఓవర్లలోనే ఈ లక్ష్యాన్ని చేరుకుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే సోహన్ కేవలం 35 బంతుల్లో అజేయంగా 100 పరుగులు చేశాడు.

హబీబుర్ రెహమాన్ సోహన్ తుఫాన్ సెంచరీ..

ఈ టోర్నమెంట్‌లో వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఇప్పుడు హబీబుర్ రెహమాన్ సోహన్ కేవలం 35 బంతుల్లోనే ఆ ఘనత సాధించాడు. సూర్యవంశీ రికార్డును అతను బద్దలు కొట్టకపోయినా, తన దేశం తరపున అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీని సాధించాడు. సోహన్ గురించి చెప్పాలంటే, అతను తన ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 8 ఫోర్లు కొట్టాడు. అతని స్ట్రైక్ రేట్ 285.71గా ఉంది. ఆసక్తికరంగా, సోహన్ కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీని చేరుకున్నాడు. కానీ అతని సెంచరీని చేరుకోవడానికి 21 బంతులు పట్టింది. వైభవ్ సూర్యవంశీ రికార్డును బద్దలు కొట్టే ఛాన్స్ మిస్సయ్యాడు.

ఇవి కూడా చదవండి

హబీబుర్ రెహమాన్ సోహన్ కెరీర్..

హబీబుర్ రెహమాన్ సోహన్ బంగ్లాదేశ్‌లోని సిరాజ్‌గంజ్‌కు చెందినవాడు. అతను అక్కడి స్థానిక క్లబ్‌ల తరపున ఆడుతూ పెరిగాడు. అతని విధ్వంసక బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. సోహన్ 2020లో ఢాకాకు వెళ్లాడు. అక్కడ షేక్ జమాల్ ధన్‌మొండి క్లబ్ అకాడమీలో శిక్షణ పొందాడు. బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్, ఢాకా ప్రీమియర్ లీగ్‌లో తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. డిసెంబర్ 28, 2023న, బంగ్లాదేశ్ క్రికెట్ లీగ్ (BCL) ODI టోర్నమెంట్‌లో, అతను కేవలం 49 బంతుల్లోనే సెంచరీ చేశాడు. లిస్ట్ Aలో సెంచరీ చేసిన అత్యంత వేగవంతమైన బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు.

25 ఏళ్ల అతను ఎనిమిది ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 21.5 సగటుతో 344 పరుగులు చేశాడు. అతను 41 వెస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 1,064 పరుగులు చేశాడు. లిస్ట్-ఎలో 133.16 స్ట్రైక్ రేట్‌తో ఉన్నాడు. టి20ల్లో, అతను 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో 605 పరుగులు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..