AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు గుడ్‌బై? అసలు ప్లాన్ తెలిస్తే బుర్ర కరాబే

Mumbai Indians: ముంబై ఇండియన్స్ చరిత్రలో ఏ కెప్టెన్‌కు రెస్ట్ ఇవ్వకుండా, ఏ ప్రధాన ఆటగాడిని వదలకుండా నిలకడగా కోర్ టీమ్‌ను కాపాడుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి, బుమ్రా లాంటి కీలక ఆటగాడిని విడుదల చేసేంత కఠిన నిర్ణయం తీసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న.

IPL 2026: ముంబై ఇండియన్స్ సంచలన నిర్ణయం.. ఇద్దరు స్టార్ ప్లేయర్లకు గుడ్‌బై? అసలు ప్లాన్ తెలిస్తే బుర్ర కరాబే
Mumbai Indians
Venkata Chari
|

Updated on: Nov 11, 2025 | 9:11 PM

Share

Mumbai Indians may Release Two Star Pacers Ahead Of IPL 2026: ఐదుసార్లు ఐపీఎల్ (IPL) ఛాంపియన్లైన ముంబై ఇండియన్స్ (MI) జట్టు, రాబోయే IPL 2026 మినీ-వేలానికి ముందు తమ కోర్ గ్రూప్‌లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. జట్టు పర్స్ విలువను పెంచుకోవడానికి మరియు జట్టు సమతుల్యతను సరిదిద్దుకోవడానికి మేనేజ్‌మెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని క్రికెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

ముఖ్యంగా, ఇద్దరు ప్రధాన పేసర్‌లను విడుదల చేసి, ఆ డబ్బును వేలంలో ఇతర లోటుపాట్లను సరిదిద్దుకోవడానికి ఉపయోగించాలని నివేదికలు సూచిస్తున్నాయి. కాగా, జస్ప్రీత్ బుమ్రా, బౌల్ట్, చాహర్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రీస్ టోప్లీ, యువ ఎడమచేతి వాటం బౌలర్ అశ్వనీ కుమార్ వంటి నాణ్యమైన పేస్ అటాక్ ముంబై జట్టులో ఉంది.

విడుదల చేయాల్సిన ఇద్దరు స్టార్ పేసర్‌లు ఎవరంటే?

జియోస్టార్ ఐపీఎల్ 2026 ‘రిటెన్షన్ ప్రివ్యూ’లో హేడెన్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. ఇందులో ముంబై ఇండియాన్స్ తమ స్టార్ ప్స్ బౌలర్ బౌల్ట్ రిటెన్షన్‌పై డైలమాలో పడిందంటూ చెప్పుకొచ్చాడు. “ముంబై ఇండియన్స్ చాలా సమతుల్య ప్లేయింగ్ ఎలెవన్‌ను కలిగి ఉంది. కానీ కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంది. ట్రెంట్ బౌల్ట్ అసాధారణంగా కనిపిస్తున్నాడు. గత సీజన్‌లో 22 వికెట్లు పడగొట్టాడు. పవర్‌ప్లేలో బలమైన ప్రభావాన్ని చూపాడు. అయితే, 12.5 కోట్ల ధరతో, యాజమాన్యం అతనిని విడుదల చేయడాన్ని పరిగణించవచ్చు. తక్కువ ధరకు అతన్ని తిరిగి కొనుగోలు చేయడానికి అవకాశం కల్పిస్తుంది. అలాగే దీపక్ చాహర్‌ను కూడా విడుదల చేసే ఛాన్స్ ఉంది. బౌల్ట్ (16 మ్యాచ్‌ల్లో 23.50 సగటుతో 22 వికెట్లతో 4వ అత్యధిక వికెట్లు), చాహర్ (14 మ్యాచ్‌ల్లో 34.18 సగటుతో 11 వికెట్లు) ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన జట్టుకు పటిష్టంగా నిలిచారు. కానీ వీరిని తప్పించాల్సిన పరిస్థితిలో ముంబై కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి

ఈ ‘డ్రాస్టిక్ స్టెప్’ వెనుక వ్యూహం ఏమిటి?

ముంబై ఇండియన్స్ జట్టు IPL 2025 సీజన్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. దీనికి ప్రధాన కారణం మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలహీనత, స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో అనుభవం లేకపోవడం. ఈ సమస్యలను అధిగమించాలంటే పర్స్ విలువను పెంచుకోవడం తప్పనిసరి. బౌల్ట్, చాహర్‌లను విడుదల చేస్తే MI కి సుమారు రూ. 20 కోట్లు పర్స్ విలువ పెరిగే అవకాశం ఉంది.

బౌల్ట్ లాంటి ప్రపంచ స్థాయి ఆటగాడిని వదులుకోవడం సాహసమే. అయితే, అతన్ని వేలంలోకి పంపి, వేరే ఫ్రాంచైజీలు బిడ్ చేసినా, RTM కార్డు ఉపయోగించి తక్కువ ధర లేదా ప్రస్తుత ధర కంటే కాస్త తక్కువకే తిరిగి కొనుగోలు చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పర్స్ పెరిగితే, వేలంలో మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్‌ను బలపరిచే లేదా బలమైన విదేశీ ఆల్‌రౌండర్‌ను కొనుగోలు చేసే అవకాశం MIకి లభిస్తుంది.

ముంబై ఇండియన్స్ చరిత్రలో ఏ కెప్టెన్‌కు రెస్ట్ ఇవ్వకుండా, ఏ ప్రధాన ఆటగాడిని వదలకుండా నిలకడగా కోర్ టీమ్‌ను కాపాడుకునే సంప్రదాయం ఉంది. కాబట్టి, బుమ్రా లాంటి కీలక ఆటగాడిని విడుదల చేసేంత కఠిన నిర్ణయం తీసుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..