Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యాడు.. కట్‌చేస్తే.. ఒక్క వీడియోతో విమర్శలపాలైన క్రికెటర్.. ఏం చేశాడో తెలుసా?

Shakib al Hasan Viral Video: బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు లెజెండరీ ప్లేయర్ షకీబ్ అల్ హసన్ ఎన్నికల బరిలో నిలిచి, ఎంపీగా విజయం సాధించాడు. దీంతో షకీబ్‌ను ఇప్పుడు రాజకీయ నాయకుడిగానూ చూడబోతున్నారు. అయితే ఇదే సమయంలో షకీబ్‌కు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది. దీనిలో అతను తన అభిమానులలో ఒకరితో అనుచితంగా ప్రవర్తించినట్లు చూడొచ్చు. దీంతో సోషల్ మీడియాలో ఆయనపై తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి.

Video: ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయ్యాడు.. కట్‌చేస్తే.. ఒక్క వీడియోతో విమర్శలపాలైన క్రికెటర్.. ఏం చేశాడో తెలుసా?
Shakib Al Hasan Slap Video
Follow us
Venkata Chari

|

Updated on: Jan 08, 2024 | 6:58 PM

Shakib al Hasan Viral Video: బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాడు. అలాగే, బరిలో నిలిచి, ఎన్నికల్లో విజయం కూడా సాధించాడు. షకీబ్ బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో మగుర్-1 స్థానం నుంచి అవామీ లీగ్ టిక్కెట్‌పై పోటీ చేశాడు. ఈ ఎన్నికల్లో ఆయన విజయం సాధించాడు. అయితే, ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో షకీబ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ అతను కోపంతో తన అభిమానిలో ఒకరిని చెంపదెబ్బ కొట్టాడు. దీంతో షకీబ్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ ఎన్నికల్లో షకీబ్ తన సమీప ప్రత్యర్థి ఖాజీ రెజుల్‌ను ఓడించాడు. ఈ ఎన్నికల్లో షకీబ్‌కు 185,388 ఓట్లు రాగా, ప్రత్యర్థి ఖాజీకి 45,993 ఓట్లు మాత్రమే వచ్చాయి. క్రికెటర్‌గానే కాకుండా ఇప్పుడు షకీబ్‌ను ఎంపీగా కూడా పిలవనున్నారు.

వీడియో వైరల్..

షకీబ్ ఎంపీ అయ్యాడన్న వార్తతో అతడికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియో ఎన్నికల రోజు నాటిదిగా చెబుతున్నారు. షకీబ్ తెల్లటి కుర్తా-పైజామా ధరించాడు. అతను ఓ ప్రదేశానికి వెళుతున్న సమయంలో ఒక అభిమాని అతనిని గట్టిగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దీంతో ఒక్కసారిగా షాక్ అయిన షకీబ్.. ఆ అభిమానిని చెంపదెబ్బ కొట్టాడు. ఈ వీడియో ఎప్పటిది, ఎక్కడి నుంచి వచ్చిందో స్పష్టంగా తెలియదు. అయితే ఓటింగ్ సమయంలో బూత్‌కు వెళుతున్న సమయంలో షకీబ్ తన అభిమానిలో ఒకరిని కొట్టాడని చెబుతున్నారు. బంగ్లాదేశ్‌లో ఆదివారమే ఓటింగ్ జరగగా, అదే రోజు ఓట్లను లెక్కించారు. దీంతో ఈ ఎన్నికల్లో షకీబ్ ఎంపీగా ఎన్నికయ్యాడు.

షకీబ్‌ని ఏకిపారేస్తోన్న నెటిజన్లు..

షకీబ్ ఈ వీడియోలో చాలా కోపంగా కనిపించాడు. అలాగే, మైదానంలోనూ తన కోపాన్ని ప్రదర్శించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి. బంగ్లాదేశ్‌లో దేశవాళీ క్రికెట్ ఆడుతున్న సమయంలో, ఒక మ్యాచ్‌లో అంపైర్ షకీబ్ అప్పీల్‌పై బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేయలేదు. దీంతో కోపోద్రేకంలో స్టంప్‌లను తన్ని వాటిని పడేశాడు. మరో మ్యాచ్‌లో అంపైర్‌తో బహిరంగంగా పోడ్లాడుతూ కనిపించాడు. ఢాకా ప్రీమియర్ లీగ్‌లో అంపైర్‌తో షకీబ్ చేసిన గొడవ కారణంగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అతనిని సస్పెండ్ చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..