Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?

జనవరి 11 నుంచి భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. టీ20 ప్రపంచకప్ 2024కి ముందు టీమ్ ఇండియాకు ఇదే చివరి అంతర్జాతీయ టీ20 సిరీస్. అటువంటి పరిస్థితిలో రోహిత్, విరాట్ తిరిగి టీ20ల్లోకి వస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. సెలక్షన్ కమిటీ వెటరన్ ఆటగాళ్లిద్దరికీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం కల్పించింది. గత 14 నెలలుగా రోహిత్, విరాట్ ఈ ఫార్మాట్‌కు దూరంగా ఉన్నారు. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ ఇంకా పూర్తి ఫిట్‌గా లేనందున ఈ సిరీస్‌కు ఎంపిక చేయలేదు. దీంతో సెలెక్టర్లు రోహిత్ శర్మకే కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించారు.

IPL 2024: ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్.. దూరం కానున్న టీమిండియా స్టార్ ప్లేయర్.. ఎందుకంటే?
Teamindia
Follow us
Venkata Chari

|

Updated on: Jan 08, 2024 | 6:24 PM

Mumbai Indians: భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్యకుమార్ యాదవ్ గురించి ఓ పెద్ద వార్త బయటకు వస్తోంది. టీమిండియా మిస్టర్ 360 ప్రస్తుతం హెర్నియా సమస్యతో బాధపడుతున్నాడు. ఇందుకోసం శస్త్రచికిత్స చేయించుకోబోతున్నాడు. దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో మూడవ మ్యాచ్‌లో సూర్య గాయపడ్డాడు. దీని కారణంగా అతను ఆఫ్ఘనిస్తాన్‌తో సిరీస్‌లో ఆడటం లేదు.

సూర్యకుమార్ యాదవ్ హెర్నియా సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. దీంతో రాబోయే IPL 2024 సీజన్‌కు దూరమయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముంబై ఇండియన్స్‌కు యాదవ్ కీలక ఆటగాడు. గత సీజన్‌లో అతను 600కు పైగా పరుగులు చేశాడు.

BCCI మూలాల మేరకు “33 ఏళ్ల అతను ఇటీవల హెర్నియాతో బాధపడుతున్నాడు. అతను ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో తన గాయంపై పనిచేస్తున్నాడు. హెర్నియా సర్జరీ కోసం స్కై త్వరలో జర్మనీకి వెళ్లనున్నారు. దీనితో పాటు, కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ రంజీ ట్రోఫీ 2024లో ముంబై తరపున ఆడటం లేదు. ఇది కాకుండా IPL 2024లో కొన్ని మ్యాచ్‌లను కోల్పోవచ్చు అని తెలిపింది.

“జూన్‌లో జరగనున్న T20 ప్రపంచ కప్ 2024కి ఫిట్‌గా ఉండటానికి సూర్యకు పూర్తి సమయం ఇవ్వనున్నారు” అని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదికలో పేర్కొంది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ కేఎల్ రాహుల్ కూడా గత సంవత్సరం స్పోర్ట్స్ హెర్నియా సమస్యతో పోరాడవలసి వచ్చింది. దీంతో కొన్ని నెలల పాటు క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. రాహుల్ సర్జరీ కూడా జర్మనీలోనే జరిగింది. ఇప్పుడు స్కై కూడా అక్కడికి వెళ్లనున్నాడు.

భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కులదీప్ యాదవ్ ., అవేష్ ఖాన్, అర్ష్‌ దీప్‌ సింగ్‌

భారత్-అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్

  • 11 జనవరి- 1వ టీ20, మొహాలీ
  • 14 జనవరి- రెండవ టీ20, ఇండోర్
  • జనవరి 17- 3వ టీ20, బెంగళూరు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..