AUS vs IND 2nd T20I: ఫలించని అభిషేక్ పోరాటం.. మెల్‌బోర్న్‌లో చిత్తుగా ఓడిన భారత్..
Australia vs India, 2nd T20I: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Australia vs India, 2nd T20I: ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. శుక్రవారం మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టాస్ ఓడిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు పేలవమైన ఆరంభం లభించింది. శుభ్‌మాన్ గిల్ (5 పరుగులు), సంజు సామ్సన్ (2 పరుగులు), తిలక్ వర్మ (0), సూర్యకుమార్ యాదవ్ (1 పరుగు) తీవ్రంగా నిరాశ పరిచారు.
హర్షిత్ రాణాతో కలిసి అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పి భారత్ స్కోరును 100 దాటించారు. అభిషేక్ 37 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అతని అవుట్ తర్వాత, భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులకే ఆలౌట్ అయింది. తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్స్ రెండంకెల స్కోరును చేరుకోలేకపోయారు. ఆస్ట్రేలియాకు చెందిన జోష్ హాజిల్‌వుడ్ మూడు వికెట్లు పడగొట్టాడు. జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ చెరో రెండు వికెట్లు పడగొట్టాడు. స్టోయినిస్ ఒక వికెట్ తీసుకున్నాడు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ రనౌట్ అయ్యారు. ఇక మూడో మ్యాచ్ నవంబర్ 2న హోబర్ట్‌లో జరగనుంది.
రెండు జట్ల ప్లేయింగ్ 11
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్, టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాట్ కున్‌హెమన్, జోష్ హేజిల్‌వుడ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








