Rishabh Pant: 99 రోజుల తర్వాత కెప్టెన్‌గా రీఎంట్రీ.. కట్‌చేస్తే.. 20 బంతుల్లోనే..
IND-A vs SA-A: టీం ఇండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ చాలా కాలం తర్వాత దక్షిణాఫ్రికా ఏ తో జరిగిన మ్యాచ్‌లో మైదానంలోకి అడుగుపెట్టాడు. అతను బాగా రాణిస్తాడని అనుకున్నారు. కానీ, అతని ఇన్నింగ్స్ కేవలం 20 బంతుల్లోనే ముగిసింది.

Rishabh Pant Poor Batting India A vs South Africa A: ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో అద్భుతంగా రాణించిన రిషబ్ పంత్ గాయంతో రెస్ట్ మోడ్‌లోకి వెళ్లాడు. ఈ క్రమంలో ఇండియా ఏ కెప్టెన్‌గా రీఎంట్రీ ఇచ్చిన రిషబ్ పంత్.. దక్షిణాఫ్రికా ఏతో జరిగిన తొలి అనధికారిక మ్యాచ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. అంటే, 99 రోజుల తర్వాత తిరిగి వచ్చిన పంత్ కేవలం 20 బంతుల్లోనే ఔటయ్యాడు. ఓపెనర్ ఆయుష్ మాత్రే అర్ధ శతంక మాత్రమే చేయగలిగాడు. మరే ఇతర బ్యాట్స్‌మెన్స్ కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేకోయారు. ఇది పర్యాటక జట్టుకు మొదటి ఇన్నింగ్స్‌లో 75 పరుగుల ఆధిక్యాన్ని ఇచ్చింది.
నిరాశపరిచిన రిషబ్ పంత్..
ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టెస్ట్‌లో బ్యాటింగ్ చేస్తున్నప్పుడు టీమ్ ఇండియా వెటరన్ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ రిషబ్ పంత్ గాయపడ్డాడు. ఆ తర్వాత దాదాపు మూడు నెలలు ఆటకు దూరంగా ఉన్నాడు. అక్టోబర్ 30న బెంగళూరులో ప్రారంభమైన దక్షిణాఫ్రికా ఏతో జరిగిన మొదటి అనధికారిక మ్యాచ్‌లో అతను తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు.
దక్షిణాఫ్రికా ‘ఏ’ తొలి ఇన్నింగ్స్‌లో 309 పరుగులకు ఆలౌట్ అయింది. మ్యాచ్ రెండో రోజు ఇండియా ‘ఏ’ తొలి ఇన్నింగ్స్‌లో రిషబ్ పంత్ బాగా రాణిస్తాడని భావించారు. కానీ, అతను 20 బంతుల్లో రెండు ఫోర్లతో సహా 17 పరుగులు మాత్రమే చేసి 234 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇండియా ‘ఏ’ తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులకు ఆలౌట్ అయింది. ఆతిథ్య జట్టు తరపున ఆయుష్ మాత్రే మాత్రమే హాఫ్ సెంచరీ చేశాడు.
ఆయుష్ మాత్రే అద్భుతమైన ఇన్నింగ్స్..
ఇండియా ఏ ఓపెనర్లు ఆయుష్ మాత్రే , సాయి సుదర్శన్ జట్టుకు అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. వీరు మొదటి వికెట్‌కు 90 పరుగులు జోడించారు. ఈ సమయంలో ఆయుష్ వేగంగా పరుగులు సాధిస్తూ, 76 బంతుల్లో 10 ఫోర్లతో 65 పరుగులు చేశాడు. సాయి సుదర్శన్ 94 బంతుల్లో 3 ఫోర్లతో 32 పరుగులు చేశాడు.
ఆయుష్ బదోని 47 బంతుల్లో 5 ఫోర్ల సహాయంతో 38 పరుగులు చేశాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్ ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయారు. ప్రేనేలన్ సుబ్రాయెన్ 5 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు పడగొట్టాడు. ఇండియా ఏ కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన ఫస్ట్ క్లాస్ రికార్డును కలిగి ఉన్నాడు.
ఫస్ట్ క్లాస్‌లో పంత్ ప్రదర్శన..
ఇండియా ఏ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పటివరకు 73 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 66 ఇన్నింగ్స్‌లలో, అతను 47.06 సగటుతో 5365 పరుగులు చేశాడు. వాటిలో 13 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రెండవ ఇన్నింగ్స్‌లో అతని నుంచి బలమైన ప్రదర్శన కోసం జట్టు ఆశిస్తుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








