AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

David Warner: సెంచరీల వీరుడు కోహ్లీ.. పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిన డేవిడ్ వార్నర్

David Warner: క్రికెటర్లలో ఎక్కువ సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ తర్వాత వార్నర్(43) ఉన్నాడు. వీరిద్దరి మధ్య అంతరం 27  సెంచరీల గ్యాప్ ఉంది. కాబట్టి వార్నర్​ చెప్పినట్లు ఇప్పట్లో కోహ్లీని చేరుకోవడం ఎవరికైనా కష్టమే....

David Warner: సెంచరీల వీరుడు కోహ్లీ..  పొగడ్తలతో ఆకాశానికి ఎత్తిన డేవిడ్ వార్నర్
David Warner Virat Kohli
Sanjay Kasula
|

Updated on: May 23, 2021 | 3:26 PM

Share

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు ఆస్ట్రేలియా కెప్టెన్ డెవిడ్ వార్నర్. అంతర్జాతీయ కెరీర్​లో 70 సెంచరీలతో ముందు వరుసలో ఉన్న కోహ్లీని అందుకోవడం తమకు చాలా కష్టమని పేర్కొన్నాడు. ప్రస్తుత తరం క్రికెటర్లలో విరాట్ కోహ్లీ రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే అని అన్నాడు. పరుగుల్లో, సెంచరీల్లో ఎన్నో రికార్డులు తనపేరిట నమోదు చేసుకున్నాడు అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం అంతర్జాతీయ కెరీర్​లో 70 సెంచరీలతో ఉన్నాడు. ఈ విషయాన్నే గుర్తుచేస్తూ ఆసీస్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఇన్​స్టా స్టోరీస్​లో ఓ  పోస్ట్ పెట్టాడు. ‘మేం కోహ్లీని అందుకోలేకపోతున్నాం ఇది నిజం’ అని రాసుకొచ్చాడు.  ప్రస్తుతమున్న క్రికెటర్లలో ఎక్కువ సెంచరీలు చేసిన వారిలో కోహ్లీ తర్వాత వార్నర్(43) ఉన్నాడు. వీరిద్దరి మధ్య అంతరం 27  సెంచరీల గ్యాప్ ఉంది. కాబట్టి వార్నర్​ చెప్పినట్లు ఇప్పట్లో కోహ్లీని చేరుకోవడం ఎవరికైనా కష్టమే. అధిగమించడం గానీ అతడి సహచర ఆటగాళ్లకు చాలా కష్టం.

David Warner

David Warner

త్వరలో ఇంగ్లాండ్​ పర్యటనకు వెళ్లనున్నటీమిండియాతో ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్​ ఆడనుంది. అంతకంటే ముందు ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ ఫైనల్​లోనూ కోహ్లీ సేను ఢీ కొట్టనున్నారు. దాదాపు రెండేళ్లుగా సెంచరీ చేయలేకపోతున్న విరాట్.. ఈ పర్యటనతో తన శతకాల సంఖ్యను పెంచుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి: CycloneYaas : యాస్ తుఫానుపై ప్రధాని రివ్యూ .. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ఆయా మంత్రిత్వశాఖలకు దిశానిర్దేశం

టెల రాజేందర్ త‌న‌యుడిపై భూమి కబ్జా ఆరోప‌ణ‌లు.. తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని సీఎం ఆదేశం

Gas Cylinder: జూన్ 1 నుంచి గ్యాస్ హోమ్ డెలివ‌రీ నిలిచిపోనుందా..? అస‌లు కార‌ణ‌మేంటో తెలుసా..?