Steve Smith: భారత్‌పై ఓటమి.. కట్‌చేస్తే.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టీవ్ స్మిత్..
ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ దిగజ్జం స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్ లో టీం ఇండియతో ఓటమి తర్వాత స్టివ్ స్మిత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఈ ప్రకటనను ధ్రువీకరించింది. డ్రెస్సింగ్ రూమ్ లోనే తన టీం మేట్స్ తో స్మిత్ ఈ నిర్ణయాన్ని పంచుకున్నాడు.

ఆస్ట్రేలియన్ బ్యాటింగ్ దిగజ్జం స్టీవ్ స్మిత్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్ ట్రోఫీ సెమీఫైనల్‌లో టీం ఇండియతో ఓటమి తర్వాత స్టివ్ స్మిత్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఈ ప్రకటనను ధ్రువీకరించింది. డ్రెస్సింగ్ రూమ్‌లోనే తన టీం మేట్స్ తో స్మిత్ ఈ నిర్ణయాన్ని పంచుకున్నాడు. 2027 ప్రపంచకప్‌నకు సన్నద్ధం కావడానికి ఆటగాళ్లకు ఇది ఒక గొప్ప అవకాశం, కనుక వన్ డే క్రికెట్‌కు ముగింపు చెప్పడానికి నాకు ఇది సరైన సమయమని భావిస్తునా అంటూ చెప్పుకొచ్చాడు. “టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఉంది.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, శీతాకాలంలో వెస్టిండీస్, ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ వేదికపై ఆడేందుకు నేను సిద్ధంగా ఉంటాను అని స్మిత్ తెలిపాడు.
స్మిత్ 2015 , 2023లో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ గెలిచిన జట్టులో భాగంగా ఉన్నాడు. మైకేల్ క్లార్క్ రిటైర్మెంట్ తర్వాత అతను 50 ఓవర్ల జట్టుకు కెప్టెన్సీని చేపట్టాడు. అతను 64 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియాకు నాయకత్వం వహించాడు. 32 మ్యాచ్‌ల్లో గెలిచాడు. 28 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. 4 మ్యాచ్‌ల్లో ఫలితాలు తేలలేదు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక ప్రాతిపదికన కెప్టెన్సీని చేపట్టాడు. గాయంతో అవుట్ అయిన పాట్ కమిన్స్ కు బదులు స్మిత్ కెప్టెన్సీ చేశాడు.స్మిత్ నిర్ణయం గురించి సెలెక్టర్ల జార్జ్ బెయిలీ మాట్లాడుతూ, “వన్ డే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకోవాలనే స్టీవ్ నిర్ణయాన్ని మేం పూర్తిగా అర్థం చేసుకున్నాం. ఆయనకు మద్దతిస్తున్నాం అని తెలిపాడు.
The great Steve Smith has called time on a superb ODI career 👏 pic.twitter.com/jsKDmVSG1h
— Cricket Australia (@CricketAus) March 5, 2025
వన్డే ఫార్మేట్ లలో 170 మ్యాచ్ ఆడిన స్మిత్ 5800 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. బాల్ ట్యాంపరింగ్ ఘటనతో స్మిత్ క్రికెట్ కెరియర్ అయిపోయిందనుకున్న తరుణంలో స్మిత్ కం బ్యాక్ ఇచ్చాడు. 2010లో వన్డే క్రికెట్లో స్మిత్ అరంగేట్రం చేశారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








