Video: ఎన్నో ఆశలతో ఓపెనర్‌గా బరిలోకి.. కట్‌చేస్తే.. డెబ్యూ బౌలర్ తొలి బంతికే ఔట్..

AUS vs WI Shamar Joseph: స్టీవ్ స్మిత్‌కు షాక్ ఇచ్చింది ఎవరో అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు? కాబట్టి అది చెప్పే ముందు, స్మిత్ కోరికల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఓపెనర్‌గా స్మిత్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలనే ఆశతో మైదానంలోకి వచ్చాడు. ఈ అడిలైడ్ టెస్టును తనకు గుర్తుండిపోయేలా చేయడానికి ఇక్కడ సెంచరీ సాధించాలనేది అతని ఆశయం. ఓపెనర్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే అతని పేరిట ఓ రికార్డు నమోదైంది.

Video: ఎన్నో ఆశలతో ఓపెనర్‌గా బరిలోకి.. కట్‌చేస్తే.. డెబ్యూ బౌలర్ తొలి బంతికే ఔట్..
aus-vs-wi-shamar-joseph-took-steve-smith
Follow us
Venkata Chari

|

Updated on: Jan 17, 2024 | 5:21 PM

AUS vs WI Shamar Joseph Took Steve Smith Wicket: అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు అనేక విధాలుగా చరిత్రాత్మకమైనది. అందులో ఒకటి స్టీవ్ స్మిత్ ఓపెనింగ్. డేవిడ్ వార్నర్ రిటైర్మెంట్ తర్వాత తొలి టెస్టు ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టుకు స్టీవ్ స్మిత్ కూడా తొలిసారి ఓపెనింగ్ చేశాడు. వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌ను 188 పరుగులకు ఆలౌట్ చేసిన తర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఈ క్రమంలో అందరి దృష్టి స్టీవ్ స్మిత్‌పై పడింది. ఎందుకంటే అతను క్రికెట్‌లోని సుదీర్ఘ ఫార్మాట్‌లో తొలిసారిగా ఓపెనింగ్‌కు వచ్చాడు. ఇప్పుడు తొలిసారి ఓపెనింగ్‌కు వచ్చిన స్మిత్‌కు ఎన్నో ఆశలతో బరిలోకి దిగాడు. అయితే, స్మిత్ ఆశలకు ఓ డెబ్యూ ప్లేయర్ భారీ షాక్ ఇచ్చాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..

స్టీవ్ స్మిత్‌కు షాక్ ఇచ్చింది ఎవరో అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోవచ్చు? కాబట్టి అది చెప్పే ముందు, స్మిత్ కోరికల గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఓపెనర్‌గా స్మిత్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలనే ఆశతో మైదానంలోకి వచ్చాడు. ఈ అడిలైడ్ టెస్టును తనకు గుర్తుండిపోయేలా చేయడానికి ఇక్కడ సెంచరీ సాధించాలనేది అతని ఆశయం. ఓపెనర్‌గా తొలి ఇన్నింగ్స్‌లోనే అతని పేరిట ఓ రికార్డు నమోదైంది.

స్టీవ్ స్మిత్ కోరికలకు బ్రేక్ వేసిన షమర్ జోసెఫ్..

స్మిత్ ఖవాజాతో కలిసి ఓపెనింగ్ చేయడానికి వచ్చినప్పుడు, అతను ఈ కోరికలను నెరవేర్చుకునే దిశగా దూసుకపోతున్నాడు. అయితే, తన తొలి టెస్టు ఆడుతున్న షమర్ జోసెఫ్ బంతిని చేతిలోకి తీసుకున్న వెంటనే, స్టీవ్ స్మిత్‌తో ఒక అరుదైన సంఘటన జరిగింది. షమర్ జోసెఫ్ వేసిన తొలి బంతికే అతను ఔటయ్యాడు. దీంతో అతని ఆశలన్నీ అడియాసలయ్యాయి. ఓపెనర్‌గా స్మిత్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

షామర్ జోసెఫ్ క్రికెటర్ కాకముందు బాడీగార్డ్‌గా ఉండేవాడు..

స్టీవ్ స్మిత్‌ను అవుట్ చేసిన షమర్ జోసెఫ్ ఒకప్పుడు బాడీగార్డ్‌గా పని చేశాడు. క్రికెట్‌లోకి రాకముందు బాడీగార్డ్‌గా పనిచేసేవాడన్నమాట. కానీ, అతని మనసు మాత్ర క్రికెట్‌పైనే నిలిచింది. దీంతో అతను వెస్టిండీస్ కోసం తన నైపుణ్యాలను అద్భుతంగా ప్రదర్శించడం ద్వారా ప్రతి క్రికెట్ అభిమాని హృదయాలను గెలుచుకున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..