రన్యా రావుతో ఇద్దరు మంత్రులకు లింక్ ఉంది! బీజేపీ ఎమ్మెల్యే సంచలన స్టేట్‌మెంట్ బీజేపీ ఎమ్మెల్యే సంచలన స్టేట్‌మెంట్
రన్యా రావు బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ కేసులో బీజేపీ ఎమ్మెల్యే యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రుల పాత్ర, ప్రోటోకాల్ ఉల్లంఘన, భూమి కేటాయింపు అక్రమాలపై ఆయన ఆరోపణలు చేశారు. కస్టమ్స్ అధికారుల పాత్రపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రన్యా రావు కోర్టులో హింసపై ఆరోపణలు చేశారు. ఈ కేసు ఎంతమందికి లింకులున్నాయో చూడాలి.

విదేశాల నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలతో నటి రన్యా రావు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే తాజా ఈ కేసు విషయంలో స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. సోమవారం సభలో మొత్తం కేసు గురించి మాట్లాడుతానని అన్నారు. రన్యా రావుతో పరిచయం ఉన్న ఇద్దరు మంత్రుల పేర్లను సభలో చెబుతాను. నేను ఇప్పుడు మీడియా ముందు దాని గురించి మాట్లాడను. ఆమెకు ప్రోటోకాల్ ఇచ్చిన వారి గురించి మేము సమాచారాన్ని సేకరించాం. వాళ్ళకి బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి కోసం తెచ్చారో నాకు తెలుసు.” అని యత్నాల్ అన్నారు.
రన్యా కేసులో కేంద్ర కస్టమ్స్ అధికారులు కూడా తప్పులు చేశారని మంత్రి సంతోష్ లాడ్ ఆరోపించారు. ఈ అంశంపై యత్నాల్ స్పందిస్తూ, “ఎవరు తప్పు చేసినా, అది తప్పే” అని అన్నారు. కస్టమ్స్ అధికారులు తప్పు చేస్తే, మేం వారిని సమర్థించడం లేదు. రన్యాకు KIADB(కర్ణాట ఇండస్ట్రీయల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డ్) 12 ఎకరాల భూమి ఇచ్చిన అంశంపై స్పందిస్తూ, మురుగేష్ నిరానీ స్వయంగా ఆ భూమిని తానే ఇచ్చానని అంగీకరించారు. అయితే డబ్బు చెల్లించకపోవడంతో దానిని రద్దు చేశారు. 12 ఎకరాల భూమికి ఎవరో డబ్బు చెల్లించడానికి ముందుకొచ్చారు. వాళ్ళు ఇవ్వలేదు. అందువల్ల, భూమి కేటాయింపును రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.
మరోవైపు కస్టడీలో తనను టార్చర్ చేస్తున్నారంటూ రన్యా రావు కోర్టుకు వెల్లడించిన విషయం తెలిసిందే. తెల్ల కాగితంపై తన సంతకాలు చేయించుకున్నారని ఆరోపించారు. కనీసం నిద్ర పోనివ్వకుండా, తిండి కూడా తిననివ్వడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. కాగా, రన్యా రావు కేసు విషయంలో ఎయిర్ పోర్టులో ప్రోటోకాల్ ఉల్లంఘన వెనుక ఆమె సమితి తండ్రి, ఐపీఎస్ అధికారి రామచంద్రరావు ఉన్నట్లు ఆరోపణలు రావడంతో, ఆయన పాత్రపై విచారణ జరపాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఎక్కడికి దారి తీస్తుందో? ఈ కేసుతో ఎంత మందికి లింకులు బయటపడతాయో చూడాలి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.