PM Modi: లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్.. తన జీవితంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై..
కంప్యూటర్ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. ఇద్దరి మధ్య మూడు గంటల పాటు పాడ్‌కాస్ట్ సాగింది. ఫ్రిడ్‌మన్‌తో జరిగిన ఈ పాడ్‌కాస్ట్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలు, హిమాలయాల్లో గడిపిన కాలం, ప్రజా జీవితంలో తన ప్రస్థానం గురించి వివరించారు ప్రధాని మోదీ.

కంప్యూటర్ సైంటిస్ట్ లెక్స్ ఫ్రిడ్‌మన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. ఇద్దరి మధ్య మూడు గంటల పాటు పాడ్‌కాస్ట్ సాగింది. ఫ్రిడ్‌మన్‌తో జరిగిన ఈ పాడ్‌కాస్ట్‌లో తన చిన్ననాటి జ్ఞాపకాలు, హిమాలయాల్లో గడిపిన కాలం, ప్రజా జీవితంలో తన ప్రస్థానం గురించి వివరించారు ప్రధాని మోదీ. అలాగే ఈ పాడ్‌కాస్ట్‌లోని ప్రధాని మోదీ తన జీవితంపై స్వామి వివేకానంద ప్రభావం ఎంతవరకు ఉందో చెప్పుకొచ్చారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘నా బాల్యంలో తరచుగా గ్రామంలోని గ్రంథాలయానికి వెళ్లేవాడిని, అక్కడ స్వామి వివేకానంద గురించి పుస్తకాలు ఎన్నో చదివాను. ఆయన బోధనలు, స్పీచ్‌లు నా జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి’ అని ప్రధాని మోదీ అన్నారు. స్వామి వివేకానంద దృష్టిలో నిజమైన సంతృప్తి అంటే వ్యక్తిగత విజయాల నుంచి రాదు.. ఇతరులకు నిస్వార్థ సేవ చేయడం ద్వారానే లభిస్తుందని తెలుసుకున్నట్టు ఆయన చెప్పారు. అంతేకాకుండా స్వామి వివేకానంద జీవితంలో జరిగిన ఓ కథ గురించి వివరించారు ప్రధానమంత్రి మోదీ.
తన తల్లి అనారోగ్యంతో ఉందని రామకృష్ణ పరమహంసకు చెబుతారు స్వామి వివేకానంద. అంతేకాకుండా తనకు సాయం చేయమని కోరుతారు. దీనికి రామకృష్ణ పరమహంస బదులిస్తూ.. దేవి కాళి వద్దకు వెళ్లి సహాయం అడగమని సలహా ఇచ్చారు. ప్రపంచానికి అన్నీ ఇచ్చిన దైవాన్ని.. తాను ఎలా సాయం అడగాలని అనుకుంటారు వివేకానంద. తద్వారా మానవాళికి సేవ చేయడం దైవభక్తికి అత్యున్నత రూపం అని గ్రహించారు వివేకానంద.
తన జీవితంలో ఆర్ఎస్ఎస్ పాత్ర..
ఆర్ఎస్ఎస్.. తన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. వారితో తనకున్న భాగస్వామ్యం అద్భుతమైనదిగా అభివర్ణించారు. ఆ సంస్థతో తనకున్న లోతైన సంబంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిబింబించారు. ఆర్‌ఎస్‌ఎస్ నుంచి తన జీవిత పరమార్ధం, నిస్వార్థ సేవా విలువలను పొందడం తన అదృష్టమని ప్రధాని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ ఇంతలా అభివృద్ధి చెందటాన్ని ఆయన ప్రశంసించారు. దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ పెద్ద ఎత్తున విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలను ఎలా అందిస్తోందో ప్రధానమంత్రి హైలైట్ చేశారు. వామపక్ష కార్మిక సంఘాలు, ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ కార్మిక సంఘాల మధ్య వ్యత్యాసాన్ని ఆయన ఎత్తి చూపారు.




