AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi Podcast: బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: ప్రధాని మోదీ

పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్‌తో జరిపిన సంభాషనలో ప్రధాని మోదీ తన బాల్య జీవితంలోని పలు సంఘటనలను గుర్తు చేసుకున్నారు. చిన్నతనంలో పేదరికంలో పెరిగినప్పటికీ, తాను దాని బరువును ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు. కష్టాల మధ్య కూడా, తాను ఎప్పుడూ లేమిని అనుభవించలేదని ఆయన గుర్తు చేసుకున్నారు..

PM Modi Podcast: బాల్యంలో పేదరికం.. కానీ ఎప్పుడూ అది బరువుగా అనిపించలేదు: ప్రధాని మోదీ
PM Modi Podcast
Srilakshmi C
|

Updated on: Mar 16, 2025 | 6:18 PM

Share

అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్‌మాన్ ప్రధాని మోదీతో 3 గంటల పాటు ఐకానిక్‌ ఇంటర్వ్యూ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందులో మోదీ పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నారు. ముఖ్యంగా తన జీవితంలోని బాల్య అనుభవాలు, పేదరికం, ప్రజా జీవితంలో తన ప్రయాణం, రాజకీయ జీవితం గురించి మోదీ మాట్లాడారు. తాను ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తగా ఉన్న రోజుల గురించి, హిందూ మతం గొప్పతనం గురించి కూడా వివరించారు.

‘బాల్యంలో పేదరికం అనుభవించా కానీ..’  ప్రధాని మోదీ

ఈ పోడ్‌కాస్ట్‌లో ప్రధాని మోదీ తన బాల్య జీవితంలోని పలు సంఘటనలను గుర్తు చేసుకుంటూ.. చిన్నతనంలో పేదరికంలో పెరిగినప్పటికీ, తాను దాని బరువును ఎప్పుడూ అనుభవించలేదని అన్నారు. కష్టాల మధ్య కూడా, తాను ఎప్పుడూ లేమిని అనుభవించలేదని ఆయన గుర్తు చేసుకున్నారు. నాటి విషయాలను ఆయన గుర్తుచేసుకుంటూ.. చిన్న తనంలో తన మామ తనకు తెల్లటి కాన్వాస్ బూట్లు ఎలా బహుమతిగా ఇచ్చాడో, వాటిని స్కూల్లో అరిగిపోయిన చాక్‌పీస్‌తో ఎలా పాలిష్ చేశాడో వంటి విషయాలను పంచుకున్నారు. జీవితంలోని ప్రతి దశను కృతజ్ఞతతో స్వీకరించానని అన్నారు. అలాగే పేదరికాన్ని ఎప్పుడూ పోరాటంగా, బరువుగా చూడలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మోదీతో ఇంటర్వ్యూ కోసం 45 గంటలు ఉపవాసం ఉన్నాను: లెక్స్ ఫ్రిడ్‌మాన్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇంటర్వ్యూ చేయబోతున్నందుకు గౌరవసూచకంగా తాను ఏకంగా 45 గంటలపాటు ఉపవాసం ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్‌మాన్ వెల్లడించాడు. ఆయన కేవలం నీళ్లు మాత్రమే తాగినట్లు తెలిపాడు. తన ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ ఉపవాసంపై తన దృక్పథాన్ని కూడా పంచుకున్నారు. ఇంద్రియాలను పదును పెట్టడంలో, మానసిక స్పష్టతను పెంచడంలో, క్రమశిక్షణను పెంపొందించడంలో ఉపవాసం పాత్రను నొక్కి చెప్పారు. ఉపవాసం అనేది కేవలం భోజనం మానేయడం మాత్రమేకాదని, ఇదొక శాస్త్రీయ ప్రక్రియ అని మోదీ అన్నారు. ఉపవాసం సాంప్రదాయ, ఆయుర్వేద పద్ధతులతో లోతుగా అనుసంధానించబడిందని ఆయన వివరించారు. శరీర నిర్విషీకరణకు సహాయపడటానికి ఉపవాసం ముందు తాను బాగా హైడ్రేట్ అవుతానని ప్రధాని మోదీ తెలిపారు. ఉపవాసం తనను మరింత శక్తివంతం చేస్తుందని, బద్దకం వీడి మరింత కష్టపడి పనిచేయడానికి ఉపయోగపడుతుందని మోదీ

ఇవి కూడా చదవండి

కాగా జనవరి 19న ఫ్రిడ్‌మాన్ ప్రధాని మోదీతో కలిసి పాడ్‌కాస్ట్ నిర్వహించగా.. మార్చి 16న దానిని విడుదల చేశారు. మోదీని అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి అని ఫ్రిడ్‌మాన్‌ అభివర్ణించాడు. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌.. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు, ఏఐ ద్వారా దేశ పురోగతి వంటి విషయాలను కూడా కవర్‌ చేసింది. కాగా లెక్స్ ఫ్రిడ్‌మాన్ మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT)లో పరిశోధనా శాస్త్రవేత్త. ఆయన యూట్యూబ్ ఛానెల్‌కి 4.8 మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. 82 కోట్లకుపైగా వీక్షణలు ఉన్నాయి. ‘ది లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్’ పేరిట అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్, ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వంటి ప్రముఖ వ్యక్తులను ఇప్పటి వరకు ఫ్రిడ్‌మాన్‌ ఇంటర్వ్యూ చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.