TV9 Telugu
13 March 2025
ఐపీఎల్ 2025 మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. ఇందులో 10 జట్లు పాల్గొంటాయి.
IPL 2025 ఈ టోర్నమెంట్‌లో 18వ సీజన్. ఈసారి 74 మ్యాచ్‌లు జరగనున్నాయి.
2008లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ బ్రాండ్ విలువ దాదాపు రూ.2900 కోట్లుగా మారింది. దీంతో రిచ్ లీగ్‌గా పేరుగాంచింది.
ఐపీఎల్ 2025గత 18 సంవత్సరాలలో, IPL బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లకు అంటే దాదాపు 90 వేల కోట్లకు పెరిగింది.
బ్రాండ్ విలువ పెరిగినందున బీసీసీఐ ఆదాయాలు కూడా పెరిగాయి. దీంతో ఐపీఎల్ లీగ్ నుంచి బీసీసీఐకి భారీగా ఆదాయం పెరిగింది.
2023-2028 సంవత్సరానికి గాను బీసీసీఐ మీడియా హక్కులను రూ.48931 కోట్లకు విక్రయించింది.
నివేదిక ప్రకారం, మీడియా హక్కుల ద్వారా బీసీసీఐకి ప్రతి మ్యాచ్‌కు దాదాపు రూ.119 కోట్లు లభిస్తాయి. అంటే, ఒక్కో మ్యాచ్ నుంచి రూ.119 కోట్లు వస్తున్నాయి.
ప్రపంచంలోనే అత్యంత రిచ్ లీగ్‌లో రెండో స్థానంలో నిలిచిన ఇండియన్ ప్రీమియర్ లీగ్.. మరింత కొత్తగా 18వ సీజన్‌కు సిద్ధమైంది.