AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరీ ఇంత దిగజారుతున్నారేంట్రా బాబు..! AIతో ఏమైనా చేస్తారా?

సుహానా ఖాన్, రింకు సింగ్ కలిసి హోలీ ఆడుతున్నట్లు ఏఐ సృష్టించిన ఫేక్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఫేక్ ఫోటోలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ ద్వారా నిజానికి దగ్గరగా ఉన్న నకిలీ కంటెంట్‌ను సృష్టించే అవకాశం, దానివల్ల కలిగే నష్టాలు, నైతిక సమస్యల అనేకం. ఇటువంటి ఫేక్ కంటెంట్ ను గుర్తించడం కూడా కష్టంగా మారింది.

మరీ ఇంత దిగజారుతున్నారేంట్రా బాబు..! AIతో ఏమైనా చేస్తారా?
Rinku Singh Suhana Khan
SN Pasha
|

Updated on: Mar 16, 2025 | 1:21 PM

Share

ఏఐ(ఆర్టిఫిషీయల్‌ ఇంటెలిజెన్స్‌)తో చూడగానే నిజం అనిపించేలా రకరకాల వీడియోలు, ఫొటోలు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. అందులో నిజమైంది ఏదో, ఏఐ క్రియేషన్‌ ఏదో గుర్తు పట్టడం కూడా చాలా కష్టంగా మారింది. చాలా మంది ఏఐ ఫొటోలను కూడా నిజం అనుకునే రేంజ్‌లో ఏఐ విధ్వంసం సాగుతోంది. తాజాగా ఆడపిల్లా అనే ఇంకితం కూడా లేకుండా.. ఓ క్రికెటర్‌తో కలిసి బికినీలో హోలీ ఆడినట్లు షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌ ఫొటో పెట్టి ఏఐ ఫొటోలను జనరేట్‌ చేశారు.

ఆ ఫొటోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే.. ఆ ఏఐ ఫొటోలపై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏఐ ఉంది కదా అని ఏది పడితే అది క్రియేట్‌ చేస్తారా అంటూ మండిపడుతున్నారు. ఐపీఎల్‌లో షారుఖ్‌ ఖాన్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ జట్టుకు సహ యజమానిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే అదే టీమ్‌లో రింకూ సింగ్‌ కొన్ని సీజన్లుగా ఆడుతూ.. మంచి ప్రదర్శన కనబరుస్తూ.. ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్‌ 18 సీజన్‌ కోసం కూడా రింకూ సింగ్‌ ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు.

ఈ క్రమంలోనే శుక్రవారం హోలీ సందర్భంగా కేకేఆర్‌ జట్టు సభ్యులతో కలిసి రింకూ సింగ్‌ హోలీని గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఆ ఫొటోలు, వీడియోలు సైతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలోనే షారుఖ్‌ ఖాన్‌ కూతురు సుహానా ఖాన్‌తో కలిసి బీచ్‌లో రింకూ సింగ్‌ హోలీ ఆడినట్లు ఏఐ సాయంతో కొంతమంది ఫొటోలు జనరేట్‌ చేసి.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆ ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. వారితో పాటు మరికొంత మంది క్రికెటర్ల, హీరోయిన్ల ఫొటోలతో కూడా ఏఐ సాయంతో ఫేక్ ఫొటోలు క్రియేట్ చేశారు. ఈ ఫొటోలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
గ్రీక్ యోగర్ట్ వర్సెస్ వే ప్రోటీన్.. తమన్నా ట్రైనర్ చెప్పేదిదే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
వామ్మో.. రికార్డ్‌ స్థాయికి బంగారం, వెండి ధరలు.. తులం ఎంతంటే?
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
గ్రేట్.. కంపెనీ అమ్మేసి ఒక్కో ఉద్యోగికి రూ. 4కోట్లు ఇస్తున్నCEO
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఆ స్టార్ హీరో వల్లే అలాంటి సినిమాలు మానేశాను..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
ఫ్యాన్స్ ముందుకు ప్రభాస్.. రాజా సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే..
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా
బారులు తీరే జుట్టు, నిగారించే చర్మం కోసం..నోరూరించే ఆమ్లా మురబ్బా