TV9 Telugu
12 March 2025
ధోనికి బీసీసీఐ నుంచి ఎంత పెన్షన్ వస్తుందో తెలుసా? అతని ప్రధాన ఆదాయ వనరులు ఏమిటి? ఇప్పుడు తెలుసుకుందాం.
ధోని ప్రస్తుతం ఐపీఎల్ 2025 కోసం సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టిన మిస్టర్ కూల్.. 6వసారి ట్రోఫీ అందుకునేందుకు ఆటగాళ్లను సిద్ధం చేసే పనిలో లీనమయ్యాడు.
చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టులో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో ధోని ఒకరు. 2024లో అతని జీతం రూ.12 కోట్లు. ఇప్పటివరకు అతను IPL నుంచి రూ.180+ కోట్లకు పైగా సంపాదించాడు.
ధోనీ గల్గోటియాస్ యూనివర్సిటీ, మాస్టర్ కార్డ్, రెడ్ బస్, ఓరియంట్ ఫ్యాన్, డ్రీమ్ 11 వంటి బ్రాండ్లకు ప్రమోషన్ ద్వారా ప్రతి సంవత్సరం రూ.50-70 కోట్లు సంపాదిస్తాడు.
మహేంద్ర సింగ్ ధోని నికర విలువ దాదాపు రూ.1200 కోట్లు+ ఉంటుందని అంచనా . క్రికెట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్, వ్యాపారం, IPL ద్వారా అతని వార్షిక ఆదాయం రూ.150 కోట్లు+గా ఉంది.
ధోని ఇప్పుడు తక్కువ క్రికెట్ ఆడుతున్నాడు. కానీ, అతనికి చాలా పెద్ద ఆదాయ వనరులు ఉన్నాయి. అద్దె, బ్రాండ్ ఒప్పందాలు, పెట్టుబడుల ద్వారా వచ్చే భారీ ఆదాయాలు అతన్ని ఆర్థికంగా సురక్షితంగా ఉంచాయి.
బీసీసీఐ ధోనికి పెన్షన్ ఇచ్చినప్పటికీ, అతని సంపాదన చాలా ఎక్కువగా ఉంది. అతను కోట్లకు పడగలెత్తాడు. ధోని కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, విజయవంతమైన వ్యాపారవేత్త కూడా.
బీసీసీఐ తన మాజీ ఆటగాళ్లకు నెలవారీ పెన్షన్ ఇస్తుంది. ధోనీకి బీసీసీఐ నుంచి నెలకు రూ.70,000 పెన్షన్ వస్తుంది. ఈ మొత్తాన్ని అతని అంతర్జాతీయ కెరీర్ ఆధారంగా నిర్ణయించారు.