WTC Final: డ్రా దిశగా గబ్బా టెస్ట్! టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుందా? సమీకరణాలివే

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ డ్రా దిశగా పయనిస్తోంది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్ లో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఇంకా 193 పరుగుల వెనుకంజలో ఉంది. ఐదో రోజు మిగిలిన ఒక వికెట్ తీయడానికి ఆస్ట్రేలియాకు పెద్దగా సమయం పట్టదు.

WTC Final: డ్రా దిశగా గబ్బా టెస్ట్! టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుకుంటుందా? సమీకరణాలివే
Team India
Follow us
Basha Shek

|

Updated on: Dec 17, 2024 | 5:25 PM

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తోంది. ఇది ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే భారత్ ఫైనల్ చేరాలంటే ఇప్పుడు ఉన్న అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆసీస్ తో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా గా ముగిసే అవకాశముంది. ఐదో రోజు గాబా టెస్టుకు వర్షం అంతరాయం కలిగితే మ్యాచ్ డ్రా అయ్యేలా కనిపిస్తోంది. గబ్బా టెస్టు మ్యాచ్ డ్రా అయితే భారత్, ఆస్ట్రేలియాలకు చెరో 4 పాయింట్లు లభిస్తాయి. తద్వారా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో టీమిండియా పాయింట్లు 114 పాయింట్లకు పెరుగుతాయి. అలాగే భారత్ విజయాల శాతం 55.88 శాతానికి పడిపోతుంది. దీంతో భారత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఆస్ట్రేలియా గెలుపు శాతం 58.88గా ఉండి రెండో స్థానంలోనే కొనసాగుతుంది. అలాగే 63.33 విజయాల శాతంతో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో కొనసాగుతుంది.

గబ్బా టెస్టు డ్రా అయితే భారత్‌కు వచ్చే రెండు మ్యాచ్‌ల్లో విజయం తప్ప మరో మార్గం లేదు. ఒక్క మ్యాచ్‌లోనైనా ఓడినా ఫైనల్ అవకాశాలు సంక్లిష్టమవుతాయి. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకోవాలంటే భారత్ చివరి రెండు మ్యాచ్‌ల్లో కచ్చితంగా విజయం సాధించాలి. ఇది కాకపోయినా కనీసం ఒక మ్యాచ్ విజయంలో సాధించి మరో మ్యాచ్ డ్రా చేసుకోవాలి. లేకుంటే డబ్ల్యూటీసీలో భారత్ టాప్-2కు చేరుకోవడం కష్టమే.

దక్షిణాఫ్రికా చివరి రెండు టెస్టు మ్యాచ్‌లు పాకిస్థాన్‌తో జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో ఒకదానిలో విజయం సాధిస్తే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో చోటు దక్కించుకోవడం ఖాయం. అయితే రెండు మ్యాచ్‌ల్లోనూ ఓటమి చవిచూస్తే లెక్కలు మారిపోతాయి. భారత్ తర్వాత శ్రీలంకతో ఆస్ట్రేలియా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ శ్రీలంక గెలిస్తే భారత్‌కు ఫైనల్ అవకాశాలు మెరుగుపడతాయి.

ఇవి కూడా చదవండి

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మూడో టెస్టు మ్యాచ్ డ్రా దిశగా సాగుతోంది. నాలుగో రోజు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇంకా 193 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ తరఫున ఆకాశ్ దీప్, జస్ప్రీత్ బుమ్రా క్రీజులో ఉన్నారు. ఈ జోడి టీమిండియాకు ఫాలో-ఆన్ ముప్పును తప్పించింది. వీరిద్దరూ చివరి వికెట్‌కు 54 బంతుల్లో 39 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆకాశ్‌ దీప్‌ 27, బుమ్రా 10 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

డ్రా దిశగా గబ్బా టెస్ట్! టీమిండియా WTC ఫైనల్‌కు చేరుకుంటుందా?
డ్రా దిశగా గబ్బా టెస్ట్! టీమిండియా WTC ఫైనల్‌కు చేరుకుంటుందా?
పైల్స్ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇదొక్కటి తింటే చాలు..
పైల్స్ సమస్యకు చెక్ పెట్టాలంటే.. ఇదొక్కటి తింటే చాలు..
ఒక వ్యక్తికి రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా చెల్లించాలా?
ఒక వ్యక్తికి రెండు బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా చెల్లించాలా?
ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్..
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
త్వరలో కుంభరాశిలో శుక్రుడు అడుగు ఈ3రాశుల వారు పట్టిందల్లా బంగారమే
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
విరాట్ కోహ్లీ, సాల్ట్, జితేష్ శర్మ పేలవ ప్రదర్శన! RCB ఆందోళన..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
ఈ ఏడాదిలో అధిక రాబడి ఇచ్చిన టాప్‌ 10 ఫండ్స్‌..
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
బన్నీ, విజయ్ దేవరకొండ.. ఇద్దరిలో ఎవరు బెస్ట్? రష్మిక ఆన్సర్ ఇదే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
ఈ విషయాలను ఎవ్వరితో చెప్పకండి.. అలా చేస్తే జీవితం నాశనం అయినట్లే
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం
హైదరాబాద్‌లో డేంజర్ బెల్స్.. రోడ్డు ప్రమాదాల్లో మొదటి స్థానం