AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asian Games 2023: శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్.. బంగారు పతకం ఒడిసి పట్టేనా?

India vs Sri Lanka: చైనా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల మహిళల క్రికెట్ ఈవెంట్‌లో టీమిండియా పతకం ఖాయమైంది. టీం ఇండియా ఇప్పుడు శ్రీలంకతో ఫైనల్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్థాన్ జట్టు శ్రీలంక చేతిలో ఘోరంగా ఓడిపోయింది. 75 పరుగులకే కుప్పకూలిన పాక్ జట్టు, ఏదశలోనూ లంకకు పోటీ ఇవ్వలేకపోయింది. దీంతో శ్రీలంక జట్టు 6 వికెట్ల తేడాతో గెలిచి, ఫైనల్ చేరుకుంది.

Asian Games 2023: శ్రీలంకతో ఫైనల్ పోరుకు సిద్ధమైన భారత్.. బంగారు పతకం ఒడిసి పట్టేనా?
Indw Vs Slw Asian Games
Venkata Chari
|

Updated on: Sep 25, 2023 | 5:54 AM

Share

India vs Sri Lanka: ఆసియా క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు స్వర్ణ పతక పోరులో ఏ జట్టు తలపడుతుందో కూడా ఖరారు అయింది. మహిళల క్రికెట్‌ రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి శ్రీలంక ఫైనల్‌కు టికెట్‌ను ఖాయం చేసుకుంది. ఇప్పుడు సోమవారం భారత్-శ్రీలంక మధ్య స్వర్ణ పతక పోరు జరగనుంది.

సెమీఫైనల్‌లో పాకిస్థాన్ జట్టు 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక ఈ లక్ష్యాన్ని సులభంగా సాధించింది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో శ్రీలంక 6 వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరుకుంది.

ఇవి కూడా చదవండి

పాకిస్థాన్ గురించి మాట్లాడితే, 20 ఓవర్లలో 75 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్తాన్ తరపున షావల్ జుల్ఫికర్ గరిష్టంగా 16 పరుగులు చేసింది. అయితే పాక్ ఆటగాళ్లలో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోరును తాకగలిగారు. ఇక శ్రీలంక గురించి చెప్పాలంటే 17వ ఓవర్ లోనే గెలిచి పతకాన్ని ఖాయం చేసుకుంది.

గెలిచినా, ఓడినా పతకం పక్కా..

ఇక సోమవారం బంగారు పతకం, కాంస్య పతక పోటీలు జరగాల్సి ఉన్నాయి. స్వర్ణ పతక పోరులో భారత్, శ్రీలంక జట్లు తలపడనుండగా, కాంస్య పతక పోరులో బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. అంటే ఆసియా క్రీడల్లో క్రికెట్ నుంచి భారత్‌కు పతకం ఖాయమైంది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి టీమిండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంటుందని అంతా భావిస్తున్నారు.

భారత్-శ్రీలంక ఫైనల్ ఎప్పుడు జరుగుతుంది?

ఆసియా క్రీడలు 2022 మహిళల క్రికెట్ ఈవెంట్‌లో భారత్ ఒక మ్యాచ్‌లో గెలిచి నేరుగా ఫైనల్‌కు చేరుకుంది. టీమ్ ఇండియా నేరుగా క్వార్టర్ ఫైనల్స్ నుంచి శుభారంభం చేయగా, సెమీ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను చాలా సులభంగా ఓడించింది. ఇప్పుడు భారత్, శ్రీలంక జట్లు ఫైనల్‌లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభమవుతుంది.

భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ స్కోర్ కార్డ్..

అన్ని మ్యాచ్‌లు గెలిచి ఫైనల్ చేరిన భారత్..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..