- Telugu News Photo Gallery Cricket photos Team India Player Shubman Gill Century against Australia 2nd odi in Indore Most Runs After 35 Innings In ODI Cricket
Shubman Gill Century: సెంచరీతో ప్రపంచ రికార్డును లిఖించిన టీమిండియా ఫ్యూచర్ స్టార్.. అదేంటంటే?
Shubman Gill Century: ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ 92 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే వన్డే సిరిస్‌ను కైవసం చేసుకుంది.
Updated on: Sep 25, 2023 | 6:00 AM

ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన 2వ వన్డే మ్యాచ్‌లో భారత్ 99 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (104) అద్భుత సెంచరీతో సత్తా చాటాడు.

ఈ మ్యాచ్‌లో గిల్ 92 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సెంచరీతో వన్డే క్రికెట్‌లో 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా శుభ్‌మన్ గిల్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

గతంలో ఈ ప్రపంచ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా పేరిట ఉండేది. తొలి 35 వన్డే ఇన్నింగ్స్‌ల్లో ఆమ్లా 1844 పరుగులు చేశాడు. ఇప్పుడు 35 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 1900+ పరుగులు సాధించి శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. దీంతో వన్డే క్రికెట్‌లో తొలి 35 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో శ్రేయాస్ అయ్యర్ 90 బంతుల్లో 105 పరుగులు చేశాడు. అంతే కాకుండా గిల్‌తో కలిసి శుభ్‌మన్ రెండో వికెట్‌కు 200 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీని ద్వారా ఇండోర్‌లో ఆస్ట్రేలియాపై శ్రేయాస్ అయ్యర్-శుభ్‌మన్ గిల్ 2వ వికెట్‌కు అత్యధిక పరుగులు చేసిన జోడీగా నిలిచారు.

ఈ ఏడాది అత్యధిక అంతర్జాతీయ సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో కూడా శుభ్‌మన్ గిల్ అగ్రస్థానంలో ఉన్నాడు. గిల్ ఇప్పటివరకు మొత్తం 7 సెంచరీలు చేశాడు.




