Asia Cup 2023: కోహ్లీపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన గంభీర్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అతనికే ఇవ్వాలంటూ..
ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా. తద్వారా ఫైనల్ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీల ఆధారంగా 356 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ భారత్ బౌలర్ల ధాటికి కేవలం 128 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరుపున 8 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 ముఖ్యమైన వికెట్లు నేలకూల్చాడు

ఆసియా కప్ సూపర్-4 మ్యాచ్‌లో భాగంగా సోమవారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది టీమ్ ఇండియా. తద్వారా ఫైనల్ రేసులో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సెంచరీల ఆధారంగా 356 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ భారత్ బౌలర్ల ధాటికి కేవలం 128 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా తరుపున 8 ఓవర్లు బౌలింగ్ చేసిన కుల్దీప్ యాదవ్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి 5 ముఖ్యమైన వికెట్లు నేలకూల్చాడు. అయితే పాకిస్థాన్‌పై సెంచరీతో చెలరేగిన కింగ్ కోహ్లి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. దీనికి కోహ్లీ కూడా అర్హుడే. కాగా గత కొన్ని రోజులుగా కోహ్లీపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తోన్న గంభీర్ మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీకి బదులు 5 వికెట్లతో పాక్ నడ్డీ విరిచిన కుల్‌దీప్ యాదవ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని కామెంట్స్ చేశాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడిన గంభీర్ ‘పాక్‌తో మ్యాచ్‌లో ఏ ఆటగాడు అద్భుతంగా రాణించాడు’ అని గౌతమ్ గంభీర్‌ను అడిగారు. దీనిపై స్పందించిన గంభీర్ కోహ్లీకి బదులుగా కుల్దీప్ యాదవ్ పేరు చెప్పాడు. ‘ పాకిస్థాన్‌పై కుల్దీప్ తొలిసారి ఐదు వికెట్లు తీశాడు. అలాగే ఆరంభంలోనే పాక్ బ్యాటింగ్ విభాగాన్ని కకావికల చేశాడు. తిరిగి కోలుకునే అవకాశం పాక్‌కు ఇవ్వలేదు. అలాగే స్పిన్‌ను ధీటుగా ఆడే పాక్ బ్యాటర్లను కుల్‌దీప్ ఉచ్చులో పడేశాడు. కాబట్టి అతడిని ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపిక చేస్తాను’ అని గంభీర్ చెప్పకొచ్చాడు.
‘విరాట్, రాహుల్ సెంచరీలు చేసిన సంగతి నాకు తెలుసు. రోహిత్, శుభ్‌మన్ గిల్ కూడా అర్ధశతకాలు సాధించారు. కానీ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలమైన వికెట్‌పై కేవలం 8 ఓవర్లలో ఐదు వికెట్లు తీయడం, ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను పాక్ బ్యాటర్లకు కుల్‌దీప్ కళ్లెం వేశాడు. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌పై కుల్దీప్ ఇలాగే రాణించి ఉంటే.. అది నాకు ప్రత్యేకంగా అనిపించేది కాదు. ఎందుకంటే వారు స్పిన్ బౌలింగ్‌ను బాగా ఆడరని నాకు తెలుసు. కాబట్టి పాకిస్థాన్‌పై అద్భుత ప్రదర్శన చేసిన కుల్‌దీప్ నా అభిప్రాయం ప్రకారం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. ఇక మ్యాచ్ అనంతరం కుల్దీప్ మాట్లాడుతూ.. పెద్ద జట్టుపై 5 వికెట్లు పడగొట్టినా అది ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు. నేను క్రికెట్ ఆడటం మానేసిన తర్వాత, పాకిస్థాన్‌పై 5 వికెట్లు తీయడం నాకు ఎప్పుడూ గుర్తుండే ఉంటుంది. “ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే మీరు బాగా ఆడే జట్లపై, ముఖ్యంగా మంచి స్పిన్ బౌలర్లను ఆడే జట్లపై మీరు బాగా రాణిస్తే, అది మిమ్మల్ని చాలా ప్రేరేపిస్తుంది” అని కుల్దీప్ తెలిపాడు.
విరాట్ కోహ్లీ సెంచరీ..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..