వారసులు వచ్చేశారు.. టీమిండియాలోకి సెహ్వాగ్, ద్రావిడ్ కుమారులు! జట్టు ప్రకటించిన బీసీసీఐ
ఆస్ట్రేలియాతో జరగనున్న అండర్-19 సిరీస్‌కు భారత జట్టులో వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ చోటు దక్కించుకున్నారు. ఆర్యవీర్ వన్డే జట్టుకు ఎంపిక కాగా, అన్వయ్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా అవకాశం పొందాడు. ఈ ఇద్దరూ ఒకే డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

భారత క్రికెట్‌లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ ఒకే భారత అండర్-19 డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోనున్నారు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరగనున్న సిరీస్‌కు ప్రకటించిన భారత యువ జట్టులో ఇద్దరికీ చోటు దక్కింది.
వన్డే జట్టులో ఆర్యవీర్, అన్వయ్
ఆర్యవీర్ సెహ్వాగ్‌ను వన్డే జట్టులో ఎంపిక చేశారు. మరోవైపు రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ వికెట్ కీపర్-బ్యాటర్‌గా 15 మంది సభ్యుల వన్డే జట్టులో చోటు సంపాదించాడు. దీంతో భారత క్రికెట్‌లో రెండు ప్రముఖ కుటుంబాలకు చెందిన తదుపరి తరం ఆటగాళ్లు ఒకే జట్టులో కలిసి ఆడే అవకాశం దక్కించుకున్నారు. తండ్రులిద్దరూ భారత క్రికెట్‌లో తమదైన ముద్ర వేశారు. సెహ్వాగ్ దూకుడైన ఓపెనింగ్ బ్యాటింగ్‌తో ప్రత్యేక గుర్తింపు పొందగా, రాహుల్ ద్రవిడ్ తన టెక్నిక్, సహనంతో ‘ది వాల్’గా పేరు సంపాదించారు. ఇప్పుడు వారి కుమారులు అండర్-19 స్థాయిలో తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.
🚨 News 🚨
India U19 squad for Australia U19 Men’s Tour of India announced.
The tour consists of three One-Day matches and two Multi-Day fixtures.
Venues 🏟️: Rajkot and Ahmedabad
More Details ▶️ https://t.co/o2pF8bj3RJ
#INDU19vAUSU19 pic.twitter.com/Ud0tvcqaBe
— BCCI (@BCCI) August 27, 2026
ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌లు
భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడనుంది. ఇందులో మూడు వన్డేలు, రెండు మల్టీ-డే మ్యాచ్‌లు ఉన్నాయి. మూడు వన్డేలు, తొలి మల్టీ-డే మ్యాచ్‌కు రాజ్‌కోట్ వేదిక కానుంది. రెండో మల్టీ-డే మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. వన్డే జట్టుకు లక్ష్య రాయ్‌చందానీ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. యశ్‌బర్ధన్ చౌహాన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. మల్టీ-డే జట్టులో మాత్రం యశ్‌బర్ధన్ చౌహాన్ కెప్టెన్‌గా, లక్ష్య రాయ్‌చందానీ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
వారసులపై ఆసక్తి
ఆర్యవీర్ సెహ్వాగ్, అన్వయ్ ద్రవిడ్ ఎంపికపై క్రికెట్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ప్రముఖ క్రికెటర్ల కుమారులుగా గుర్తింపు లభించినప్పటికీ, మైదానంలో వారి ప్రతిభే భవిష్యత్తును నిర్ణయించనుంది. ఆస్ట్రేలియాతో సిరీస్ యువ ఆటగాళ్లకు అంతర్జాతీయ స్థాయి పరిస్థితులను ఎదుర్కొనే మంచి అవకాశం కానుంది. ముఖ్యంగా సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ప్రదర్శనపై అభిమానులు ప్రత్యేకంగా దృష్టి సారించే అవకాశం ఉంది.
