AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడపైకి ఎక్కకుండానే ట్యాంక్‌లో నీరు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోండి.. ఈ సింపుల్ ట్రిక్‌తో ఈజీ!

ఇళ్లలో నీటి వాడకం రోజువారీ జీవితంలో కీలకమైనది. అయితే ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్‌లో ఎంత నీరు మిగిలి ఉందో తెలుసుకోవడం ఎప్పుడూ పెద్ద సమస్యే. ప్రతిసారీ మెట్లు ఎక్కి మేడపైకి వెళ్లడం, ట్యాంక్ మూత తీసి చూడటం ఎంతో శ్రమతో కూడుకున్న పని. ముఖ్యంగా వృద్ధులకు, వేసవి కాలంలో ఎండలో పైకి వెళ్లాల్సి వచ్చినప్పుడు ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి సోషల్ మీడియాలో ఒక అద్భుతమైన దేశీ జుగాడ్ బాగా వైరల్ అవుతోంది.

మేడపైకి ఎక్కకుండానే ట్యాంక్‌లో నీరు ఎంతవరకు ఉన్నాయో తెలుసుకోండి.. ఈ సింపుల్ ట్రిక్‌తో ఈజీ!
Water Tank Level Indicator
Jyothi Gadda
|

Updated on: Oct 06, 2026 | 5:04 PM

Share

ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్‌లో ఎంత నీరు ఉందో తెలుసుకోవడానికి ప్రతిసారీ మెట్లు ఎక్కి మేడపైకి వెళ్లి మూత తీసి చూడటం చాలా శ్రమతో కూడుకున్న పని. ఈ సమస్యకు పరిష్కారంగా సోషల్ మీడియాలో ఒక సింపుల్ దేశీ జుగాడ్ హ్యాక్ వైరల్ అవుతోంది. దీని కోసం ఒక లీటరు ఖాళీ ప్లాస్టిక్ సీసా, రెండు విభిన్న పరిమాణాల ప్లాస్టిక్ పైపులు ఉపయోగిస్తారు. ట్యాంక్‌లో నీటి మట్టం పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు కింద ఉన్న పైపు ఎత్తు మారుతుంది. దీనివల్ల మేడపైకి వెళ్లకుండానే కింద నుంచే ట్యాంక్‌లోని నీటి స్థాయిని సులభంగా తెలుసుకోవచ్చు.

ఈ హ్యాక్‌కు కావలసిన వస్తువులు:

ఈ సులువైన ట్రిక్ కోసం ఎలాంటి ఖరీదైన ఎలక్ట్రానిక్ సెన్సార్లు లేదా విద్యుత్ కనెక్షన్లు అవసరం లేదు. ఇంట్లోనే లభించే సాధారణ వస్తువులతో దీనిని తయారు చేసుకోవచ్చు. దీనికోసం కావాల్సిన వస్తువులు

ఒక లీటరు ఖాళీ ప్లాస్టిక్ బాటిల్

ఇవి కూడా చదవండి

1 అంగుళం వ్యాసం కలిగిన PVC పైపు

3/4 అంగుళం వ్యాసం కలిగిన పొడవైన PVC పైపు

ప్లాస్టిక్ ఎల్బో జాయింట్, కలర్ టేప్

ఇది ఎలా పనిచేస్తుంది?:

మొదట 1 అంగుళం వెడల్పు ఉన్న PVC పైపును ట్యాంక్ బయటి వైపు నిలువుగా అమర్చుతారు. దాని లోపల తేలికగా కదిలేలా 3/4 అంగుళం పైపును అమర్చుతారు. ఈ సన్నని పైపు అడుగు భాగంలో ఖాళీ ప్లాస్టిక్ సీసాను బిగించి వాటర్‌ప్రూఫ్ టేప్‌తో గట్టిగా సీల్ చేస్తారు. ఈ బాటిల్ ట్యాంక్‌లోని నీటిలో ఈదే ఫ్లోటర్ లాగా పనిచేస్తుంది. పైపు పైభాగంలో గుర్తించడానికి ఒక కలర్ టేప్ లేదా ఎల్బో బిగిస్తారు. ట్యాంక్‌లో నీటి మట్టం పెరిగినప్పుడు ప్లాస్టిక్ బాటిల్ పైకి తేలుతుంది. దానివల్ల లోపల ఉన్న సన్నని పైపు పైకి తోయబడి బయటకు కనిపిస్తుంది. నీరు తగ్గేకొద్దీ ఆ పైపు కిందకు జారిపోతుంది.

ప్రయోజనాలు:

బాటిల్, పైపు కదలికను బట్టి కింద నుంచే లేదా మేడ వద్దకు వెళ్లకుండానే నీటి మట్టాన్ని ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. విద్యుత్ అవసరం లేనందున కరెంట్ బిల్లు పడదు, వైరింగ్ పాడయ్యే ప్రమాదం ఉండదు. ఈ చిన్న సాంకేతిక చిట్కాతో ప్రతిసారీ మెట్లు ఎక్కే తిప్పలు తప్పడమే కాకుండా, ట్యాంక్ నిండి నీరు వృథా కాకుండా చూసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us