Video: తొలి 3 ఓవర్లలో విలన్.. కట్‌చేస్తే.. చివరి ఓవర్‌లో హీరోగా మారిన బౌలర్.. థ్రిల్లింగ్ వీడియో
IND vs AUS 5th T20: ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం చివరి ఓవర్ వరకు చేరింది. అయితే, ఆస్ట్రేలియా విజయానికి చివరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం. కెప్టెన్ మాథ్యూ వేడ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత అభిమానులు అర్ష్‌దీప్ సింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే, అంతకుముందు వేసిన మూడు ఓవర్లతో గుబులు పుట్టించిన అర్షదీప్.. చివరి 6 బంతుల్లో ఆకట్టుకున్నాడు. దీంతో అర్ష్‌దీప్ సింగ్ హీరోగా అవతరించాడు.

Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్ భారతీయ అభిమానుల దృష్టిలో విలన్‌గా మారాడు. ఈ బౌలర్ వేసిన తొలి 3 ఓవర్లలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ 37 పరుగులు బాదేశారు. కానీ, కేవలం 6 బంతుల్లో అర్ష్‌దీప్ సింగ్‌ను విలన్ నుంచి హీరోగా మార్చుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఆరంభం బాగోలేదు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ తొలి ఓవర్‌లో 14 పరుగులు చేశారు. ఆ తర్వాత కూడా అర్ష్‌దీప్ సింగ్ బంతుల్లో పరుగులు సులువుగా వచ్చాయి. అలాగే, ఈ బౌలర్ నిరంతరం ఫుల్ టాస్ బంతులు వేయడం, కంగారూ బ్యాట్స్‌మెన్ కోరుకున్న షాట్లు కొట్టడంతో విసుగు తెప్పించాడు. అయితే, అర్ష్‌దీప్ చివరి ఓవర్‌లో హీరో అయ్యాడు.
చివరి 6 బంతుల్లో మాయ..
ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ ఫలితం చివరి ఓవర్ వరకు చేరింది. అయితే, ఆస్ట్రేలియా విజయానికి చివరి 6 బంతుల్లో 10 పరుగులు అవసరం. కెప్టెన్ మాథ్యూ వేడ్ బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. భారత అభిమానులు అర్ష్‌దీప్ సింగ్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే, అంతకుముందు వేసిన మూడు ఓవర్లతో గుబులు పుట్టించిన అర్షదీప్.. చివరి 6 బంతుల్లో ఆకట్టుకున్నాడు. దీంతో అర్ష్‌దీప్ సింగ్ హీరోగా అవతరించాడు. చివరి ఓవర్ బౌలింగ్ చేయడానికి అర్ష్‌దీప్ సింగ్ వచ్చాడు. తొలి 2 బంతుల్లో పరుగులు రాలేదు. మూడో బంతికి అర్ష్‌దీప్ సింగ్ మాథ్యూ వేడ్‌ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత చిన్నస్వామి స్టేడియం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. స్టేడియం మొత్తం ఆనందంతో ఈలలు, గోలలు, డ్యాన్స్‌లు మొదలయ్యాయి.
చివరి 6 బంతుల్లో హీరోగా మారిన అర్ష్‌దీప్ సింగ్..
In the #T20WorldCup , Mukesh Kumar/ Arshdeep Singh should be the 2nd and 3rd pace bowler along with Bumrah.
– However, these bowlers have to prove more in overseas to replace shami and siraj. #MukeshKumar #INDvSA #ArshdeepSingh #BCCI #SuryakumarYadavpic.twitter.com/yy9V3Whx0a
— Pulkit Trigun (@PulkitTrigun45) December 3, 2023
భారత్ విజయానికి అడ్డంకిగా మారిన మాథ్యూ వేడ్ పెవిలియన్ బాట పట్టాడు. ఇప్పుడు ఆస్ట్రేలియా చివరి 3 బంతుల్లో 10 పరుగులు చేయాల్సి వచ్చింది. అంటే అర్ష్‌దీప్ సింగ్ వేసిన మొదటి 3 బంతుల్లో ఎటువంటి పరుగులు రాలేదు. నాలుగు, ఐదో బంతుల్లో కేవలం 2 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో భారత జట్టు విజయం ఖాయమైంది. మళ్లీ చివరి బంతికి సింగిల్ వచ్చింది. ఈ మ్యాచ్‌లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. స్టేడియం మొత్తం ఆనందంతో మార్మోగింది. ఈ క్రమంలో 5 టీ20ల సిరీస్‌ని 4-1తో భారత జట్టు కైవసం చేసుకుంది. 19వ ఓవర్ వరకు క్రిమినల్‌గా నిలిచిన అర్ష్‌దీప్ సింగ్.. భారత అభిమానుల దృష్టిలో హీరోగా మారాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




