IPL 2023: ఈ సారి సచిన్‌ తనయుడి సుడి తిరిగినట్లే.. ముంబై ప్లేయింగ్‌ XI లో అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్‌! కారణమిదే

గాయాల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌ 2023) నుంచి తప్పుకున్న ఆటగాళ్ల జాబితా ఈసారి పెద్దదిగానే ఉంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈసారి లీగ్‌లో ఆడటం లేదు. చాలా కాలంగా గాయంతో

IPL 2023: ఈ సారి సచిన్‌ తనయుడి సుడి తిరిగినట్లే.. ముంబై ప్లేయింగ్‌ XI లో అర్జున్‌ టెండూల్కర్‌కు ఛాన్స్‌! కారణమిదే
అర్జున్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 24తో బరిలోకి దిగాడు. ఏప్రిల్ 24న సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు. అర్జున్ తన జెర్సీ నంబర్‌ను తన తండ్రికి అంకితం చేశాడు.
Follow us

|

Updated on: Mar 29, 2023 | 12:31 PM

గాయాల కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (ఐపీఎల్‌ 2023) నుంచి తప్పుకున్న ఆటగాళ్ల జాబితా ఈసారి పెద్దదిగానే ఉంది. ముఖ్యంగా ముంబై ఇండియన్స్ స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఈసారి లీగ్‌లో ఆడటం లేదు. చాలా కాలంగా గాయంతో ఇబ్బంది పడుతున్న బుమ్రా సీజన్‌ మొత్తానికి దూరం కానున్నాడు. బుమ్రా నిష్క్రమణ రోహిత్ సేనకు బ్యాడ్ న్యూస్ అయితే ఇప్పటి వరకు ఆ జట్టుకు ఆడలేకపోయిన యువకులకు ఇది పెద్ద అవకాశం. ముఖ్యంగా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెండూల్కర్‌ తనయుడు అర్జున్‌ టెండూల్కర్‌కు ఇది మంచి అవకాశం. ఐదు టైటిళ్లను గెలుచుకున్న ఈ లీగ్‌లో ముంబై ఇండియన్స్ అత్యంత విజయవంతమైన జట్టు. అయితే ఈసారి మాత్రం ఆజట్టుకు ఇక్కట్లు తప్పేలా లేవు. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగం చాలా బలహీనంగా ఉంది. రేసుగుర్రం బుమ్రాతో పాటు, ఆసీస్‌ ఫాస్ట్ బౌలర్ జే రిచర్డ్‌సన్ కూడా సీజన్‌ మొత్తం జట్టుకు దూరంగా ఉండనున్నారు. దీంతో ఈ సీజన్‌లో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రంపై అంచనాలు పెరిగాయి. ఆల్‌రౌండర్‌గా పేరున్న అర్జున్ టెండూల్కర్ 2021లో ముంబై ఇండియన్స్‌ జట్టులో చేరాడు. అయతే టీమ్‌లో టిమ్ డేవిడ్, కెమరూన్ గ్రీన్ వంటి ఆటగాళ్లు ఉండటంతో అర్జున్‌కు ఎప్పుడూ అవకాశం రాలేదు. అయితే ఈ సీజన్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది.

అర్జున్‌కు అవకాశం ఇవ్వడం వల్ల ముంబై బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ విభాగం కూడా మరింత బలంగా మారుతుందని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. క్యామెరూన్‌ గ్రీన్‌తో కలిసి జట్టుకు ఆల్‌రౌండర్‌గా సేవలందించగలడని రోహిత్ సేన భావిస్తోంది. కాగా రంజీ ట్రోఫీలో గోవా తరఫున ఆడుతూ మంచి ప్రదర్శన చేశాడు అర్జున్‌. తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించాడు. ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతను మొత్తం 547 పరుగులు చేశాడు. అలాగే 12 వికెట్లు కూడా తీసుకున్నాడు. ఇక దేశీయ క్రికెట్‌ల 9 T20 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు కూల్చాడు. అలాగే 180 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..