- Telugu News Photo Gallery Cricket photos IPL 2023: Interesting facts of KKR new captain Nitish Rana Wife Saachi Marwah, know which famous hero is she a relative
IPL 2023: కేకేఆర్ కొత్త కెప్టెన్ నితీష్ రాణా భార్య ఓ స్టార్ హీరో మేనకోడలు.. ఆమె అందానికి ఫిదా కావాల్సిందే
రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో ఈ సీజన్‌లో స్టాండింగ్ కెప్టెన్‌గా కోల్‌కతాను ముందుండి నడిపించనున్నాడు నితీశ్ రాణా. 2018 సంవత్సరంలో కేకేఆర్‌తో చేరిన నితీశ్‌కు కెప్టెన్సీ చేయడం ఇదే మొదటి సారి. ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్‌లో 12 టీ20 మ్యాచ్‌లకు రానా కెప్టెన్‌గా..
Updated on: Mar 29, 2023 | 1:15 PM

రెగ్యులర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడడంతో ఈ సీజన్‌లో స్టాండింగ్ కెప్టెన్‌గా కోల్‌కతాను ముందుండి నడిపించనున్నాడు నితీశ్ రాణా. 2018 సంవత్సరంలో కేకేఆర్‌తో చేరిన నితీశ్‌కు కెప్టెన్సీ చేయడం ఇదే మొదటి సారి.

అయితే ఢిల్లీ తరఫున దేశవాళీ క్రికెట్‌లో 12 టీ20 మ్యాచ్‌లకు రానా కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇందులో 8 విజయాలు, నాలుగు ఓటములు ఉన్నాయి. ఇక అతని కెప్టెన్సీలోనే ఢిల్లీ జట్టు గత ఏడాది సయ్యద్ మోడీ ట్రోఫీలో క్వార్టర్‌ఫైనల్‌కు చేరుకుంది.

ఇక నితీశ్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. అతని భార్య పేరు సాచి మార్వా. వీరిది ప్రేమ వివాహం. పెళ్లికి ముందు సుమారు మూడున్నరేళ్ల పాటు తాము డేటింగ్ చేసినట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడీ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్.

2016లో నితీశ్-సాచి నిశ్చితార్థం చేసుకున్నారు. 2019లో పెద్దల అనుమతితో పెళ్లి చేసుకున్నారు. కాగా వయసులో నితీశ్ కంటే సాచి ఏడాది వయసు పెద్దది కావడం గమనార్హం.

సాచి మార్వా ఓ ఇంటరీయర్ డిజైనర్, ఆర్కిటెక్ కూడా. ఈమె బాలీవుడ్ ప్రముఖ నటుడు గోవిందాకు మేనకోడలు వరుస అవుతుంది. అలాగే ప్రముఖ నటుడు, కమెడియన్ అండ్ రైటర్ అభిషేక్ కృష్ణకు కజిన్ సిస్టర్ అవుతుంది.





























