- Telugu News Sports News Cricket news ICC Rankings: Suryakumar Yadav no.1 batter in T20 and IPL 2023 GT player Rashid khan no.1 bowler in T20
IPL 2023: గుజరాత్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. తొలి మ్యాచ్‌కు ముందే జోష్ నింపిన ఐసీసీ.. అదేంటంటే?
ICC Latest Rankings: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 మార్చి 31 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే, ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్, గుజరాత్ టైటాన్స్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నంబర్ 1 స్థానానికి చేరుకున్నాడు.
Updated on: Mar 29, 2023 | 4:11 PM

పాకిస్థాన్‌ను తన స్పిన్‌తో ముప్పుతిప్పలు పెట్టిన ఆఫ్ఘనిస్తాన్ స్టార్ ప్లేయర్ రషీద్ ఖాన్.. ఐపీఎల్ ప్రారంభానికి ముందే గుడ్ న్యూస్ అందుకున్నాడు. ఈ అఫ్గానీ లెగ్ స్పిన్నర్ మరోసారి టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో రషీద్ ఖాన్ నంబర్ 1 బౌలర్‌గా నిలిచాడు. అతను వనెందు హసరంగాను అధిగమించి, అగ్రస్థానానికి చేరుకున్నాడు.

పాకిస్థాన్‌తో జరిగిన మూడు టీ20ల్లో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. అయితే అతని ఎకానమీ రేటు అద్భుతంగా ఉంది. ఈ ఆటగాడు తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో ఒక్క ఫోర్-సిక్స్ కూడా ఇవ్వలేదు. రషీద్ ఖాన్ బౌలింగ్ ముందు పాకిస్థాన్ వద్ద సమాధానం లేకుండా పోయింది. ఈ సిరీస్‌ను ఆఫ్ఘనిస్థాన్ 2-1తో కైవసం చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ మొదటిసారిగా ఒక సిరీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది.

రషీద్ ఖాన్ ఇప్పుడు IPL 2023లో నంబర్ 1 టీ20 బౌలర్‌గా ప్రవేశించనున్నాడు. రషీద్ ఖాన్ గుజరాత్ టైటాన్స్ కీలక ఆటగాడు. ఈ ఆటగాడు గత సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 19 వికెట్లు పడగొట్టాడు. అతని ఎకానమీ రేటు ఓవర్‌కు కేవలం 6.6 పరుగులు మాత్రమే. రషీద్ ఖాన్ బౌలింగ్ ఆధారంగా గుజరాత్ టైటాన్స్ IPLను గెలుచుకుంది.

ఇక టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో మూడో స్థానానికి దిగజారాడు. ప్రస్తుతం నంబర్ 1 వన్డే బౌలర్‌గా జోష్ హేజిల్‌వుడ్ నిలిచాడు. ఐపీఎల్‌లో హేజిల్‌వుడ్ RCB తరపున ఆడనున్నాడు. ట్రెంట్ బౌల్ట్ రెండో స్థానంలో ఉన్నాడు.

టీ20 బ్యాట్స్‌మెన్ గురించి చెప్పాలంటే, సూర్యకుమార్ పవర్ చెక్కుచెదరలేదు. వన్డే ఫార్మాట్‌లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ దారుణంగా ఉన్నప్పటికీ, ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ నంబర్ 1 స్థానంలోనే ఉంచింది.





























