AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT IPL 2023 Preview: చెన్నైతో తొలిపోరు.. డిఫెండింగ్ ఛాంపియన్‌ ప్లేయింగ్ XIలో కీలకమార్పులు..

Gujarat Titans Best Playing XI: IPL 2023 మొదటి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. గుజరాత్‌ టైటాన్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

GT IPL 2023 Preview: చెన్నైతో తొలిపోరు.. డిఫెండింగ్ ఛాంపియన్‌ ప్లేయింగ్ XIలో కీలకమార్పులు..
Gujarat Titans
Venkata Chari
|

Updated on: Mar 29, 2023 | 3:36 PM

Share

Gujarat Titans Best Playing XI: ఐపీఎల్ 16వ సీజన్ అంటే IPL 2023 ప్రారంభానికి ఇప్పుడు కేవలం 2 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈసారి సీజన్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అద్భుతమైన మ్యాచ్‌తో లీగ్ ప్రారంభమవుతుంది. గుజరాత్ గత సీజన్‌లో రెండుసార్లు చెన్నైని ఓడించింది. అయితే చెన్నై అద్భుతమైన పునరాగమనం చేయడంలో పేరుగాంచింది. ఇటువంటి పరిస్థితిలో గుజరాత్ తన మొదటి మ్యాచ్‌కు చాలా ఆలోచనాత్మకంగా ప్లేయింగ్ ఎలెవన్‌ను సిద్ధం చేయాల్సి ఉంటుంది. మొదటి మ్యాచ్‌లో గుజరాత్‌కి చెందిన అత్యుత్తమ ప్లేయింగ్ XIని ఇప్పుడు చూద్దాం..

తొలి మ్యాచ్‌లో హార్దిక్ జట్టు ఎలా ఉండనుంది?

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుభమాన్ గిల్ నంబర్-1 స్థానంలో బరిలోకి దిగనున్నాడు. ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో సెంచరీలు సాధించాడు. అందుకే ఓపెనింగ్‌లో గుజరాత్ జట్టుపై భారీ అంచనాలు ఉంటాయి.

వృద్ధిమాన్ సాహా నంబర్-2 లో ఉండే ఛాన్స్ ఉంది. అతను పవర్‌ప్లేలో జట్టుకు బలమైన ఆరంభాన్ని అందించగలడు. అంతే కాకుండా వికెట్ కీపింగ్ పరంగా గుజరాత్‌కు ఎలాంటి ఆందోళన కూడా లేదు. సాహా, గిల్‌లు గుజరాత్‌కు శుభారంభం అందించగలరు.

ఇవి కూడా చదవండి

నంబర్-3 లో కేన్ విలియమ్సన్ కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్ ఎవరు ఉంటారు. ప్రస్తుతం కేన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల టెస్టుల్లో సెంచరీలతో సత్తా చాటాడు. ఇలాంటి పరిస్థితుల్లో గుజరాత్ అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది.

కెప్టెన్ హార్దిక్ పాండ్యా 4వ స్థానంలో బరిలోకి దిగనున్నాడు. గతేడాది 4వ ర్యాంక్‌లో వచ్చిన హార్దిక్ జట్టుకు అవసరమైన సమయంలో కీలక పాత్ర పోషించాడు. భారీ షాట్‌లు, సింగిల్‌-డబుల్‌ల కలయికతో స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించాడు. అటువంటి పరిస్థితిలో హార్దిక్ నంబర్-4 కోసం పర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడు. హార్దిక్ బౌలింగ్‌లో కూడా సత్తా చాటుతున్నాడు.

ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ వేడ్‌ను 5వ స్థానంలో దింపవచ్చు. ఈ స్థానానికి గుజరాత్‌లో డేవిడ్ మిల్లర్ కంటే మెరుగైన బ్యాట్స్‌మెన్ మరొకరు లేకపోయినా, మొదటి కొన్ని మ్యాచ్‌లలో డేవిడ్ మిల్లర్ అందుబాటులో ఉండడు. కాబట్టి, గుజరాత్ ఐదవ స్థానంలో ఆడే అవకాశం మాథ్యూ వేడ్‌కు ఇవ్వవచ్చని తెలుస్తోంది.

గత కొన్నేళ్లుగా ఐపీఎల్‌లో భయాందోళనలు సృష్టించిన రాహుల్ తెవాటియాను గుజరాత్ నంబర్-6 లో పంపవచ్చు. ఐపీఎల్‌లో, రాహుల్ తన జట్టును చాలాసార్లు గెలిపించాడు.

రషీద్ ఖాన్ 7వ స్థానంలో బరిలోకి దిగే చాన్స్ ఉంది. ఈ ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు తన స్పిన్ బౌలింగ్‌తో, సత్తా చాటడమే కాక, అవసరమైనప్పుడు భారీ షాట్‌లను కూడా కొట్టగలడు.

గుజరాత్ ఆర్. సాయి కిషోర్‌ను 8వ స్థానంలో పంపవచ్చు. ఈ ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ చాలా సంవత్సరాలు చెన్నై సూపర్ కింగ్స్‌లో భాగంగా ఉన్నాడు. దీంతో చెన్నై వ్యూహాలు, వారి బ్యాట్స్‌మెన్ బలహీనతల గురించి ఒక ఆలోచన కలిగి ఉంటాడు. గుజరాత్ అతనికి తమ జట్టులో ఆడే అవకాశం ఇవ్వగలదు.

మహ్మద్ షమీ 9వ నంబర్‌లో ఆడతాడు. అతను ఫాస్ట్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో కొన్ని పెద్ద షాట్‌లు కొట్టగల సామర్థ్యం కలవాడు.

ఐపీఎల్‌లో అత్యుత్తమ బౌలింగ్ రికార్డును కలిగి ఉన్న వెస్టిండీస్‌కు చెందిన అల్జారీ జోసెఫ్ నంబర్-10 లో ఉండే అవకాశం ఉంది. 145-150 కి.మీ.ల వేగంతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించేందుకు సిద్ధమయ్యాడు.

యశ్ దయాల్ నంబర్-11 లో ఆడే అవకాశం ఉంది. గత ఐపీఎల్ సీజన్‌లో గుజరాత్ తరపున ఈ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ ఎడమచేతి వాటం బౌలర్ కొత్త బంతితో స్వింగ్ చేయడం ద్వారా బ్యాట్స్‌మెన్‌ను చాలా ఇబ్బంది పెడతాడు.

గుజరాత్‌కు ప్రాబబుల్ ప్లేయింగ్ XI ఇదే..

శుభమాన్ గిల్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), మాథ్యూ వాడే, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాళ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..