AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023: ఢిల్లీ టీంలోకి బెంగాల్‌ నయా సంచలనం ఎంట్రీ.. పంత్ స్థానంలో లక్కీ ఛాన్స్..

Abhishek Porel: రిషబ్ పంత్ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు మరో ప్లేయర్‌ను ఎంచుకుంది. అతని స్థానంలో బెంగాల్ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ను జట్టులోకి వచ్చాడు.

IPL 2023: ఢిల్లీ టీంలోకి బెంగాల్‌ నయా సంచలనం ఎంట్రీ.. పంత్ స్థానంలో లక్కీ ఛాన్స్..
Abhishek Porel
Venkata Chari
|

Updated on: Mar 29, 2023 | 2:45 PM

Share

ఐపీఎల్ 2023లో రిషబ్ పంత్ ఆడడం లేదనే సంగతి తెలిసిందే. అయితే, తాజాగా పంత్ స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. టీమ్ మేనేజ్‌మెంట్ పంత్ స్థానంలో బెంగాల్‌కు చెందిన యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ పోరెల్‌ను చేర్చుకుంది. గతేడాది డిసెంబర్‌లో ఢిల్లీ నుంచి రూర్కీ వెళ్తుండగా పంత్‌ కారు ప్రమాదంలో గాయపడ్డాడు. దీంతో అతను ఐపీఎల్ 2023లో ఆడడం లేదు. ఇప్పుడు అతని స్థానంలో అభిషేక్ పోరెల్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ చేర్చుకుంది. అభిషేక్ పోరెల్ ఎవరు, ఎలా అవకాశం వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందా..

అభిషేక్ పోరెల్ ఎవరు?

అభిషేక్ పోరెల్ బెంగాల్‌కు చెందిన యువ వికెట్ కీపర్ కం బ్యాట్స్‌మెన్. అతను దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. వికెట్ కీపింగ్‌తో పాటు ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. గతేడాది అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2022 సంవత్సరంలోనే, అతను దేశవాళీ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. రంజీ ట్రోఫీ అరంగేట్రంలో బరోడాపై హాఫ్ సెంచరీ సాధించాడు. అలాగే రంజీ ట్రోఫీ ఫైనల్‌లోనూ అర్ధ సెంచరీ ఆడాడు. అతను చాలా ప్రతిభావంతుడైన ఆటగాడిగా పేరుగాంచాడు. గతంలో, ఢిల్లీ క్యాపిటల్స్ ప్రధాన కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్ స్థానంలో కొంతమంది వికెట్ కీపర్లపై ట్రయల్స్ తీసుకున్నారు. వీరిలో అభిషేక్ పోరెల్ కూడా ఉన్నాడు. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో చేరే అవకాశం వచ్చింది.

ఇవి కూడా చదవండి

అభిషేక్ పోరెల్ క్రికెట్ కెరీర్..

అభిషేక్ పోరెల్‌కు క్రికెట్‌లో పెద్దగా అనుభవం లేదు. అతను ఇప్పటివరకు 16 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. అందులో అతను 695 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను 6 అర్ధ సెంచరీలు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 73 పరుగులు. అభిషేక్ 3 లిస్ట్ ఏ మ్యాచ్‌లలో కూడా పాల్గొన్నాడు. అతను 54 పరుగులు చేసిన ఈ మ్యాచ్‌లలో ఒక ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం లభించింది. ఇది కాకుండా అతను 3 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. అందులో అతను 22 పరుగులు చేయగలిగాడు. అభిషేక్ పోరెల్‌కు ఎలాంటి అనుభవం లేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు: డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), అక్షర్ పటేల్ (వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, రోవ్‌మన్ పావెల్, సర్ఫరాజ్ ఖాన్, యశ్ ధుల్, మిచెల్ మార్ష్, లలిత్ యాదవ్, అన్రిచ్ నార్ట్జే, చేతన్ సకారియా, కమలేష్ నాగర్‌కోటి, ఖలీల్ అహ్మద్, లుంగి ఎన్‌గిడి ముస్తాఫిజుర్ రెహమాన్, అమన్ ఖాన్, కుల్దీప్ యాదవ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, ఫిల్ సాల్ట్, ఇషాంత్ శర్మ, ముఖేష్ కుమార్, మనీష్ పాండే, రిలీ రోసోవ్, రిపాల్ పటేల్, అభిషేక్ పోరెల్

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
సమ్మర్ ఫ్రిజ్ టిప్స్.. ఈ తప్పులు చేశారో ఫ్రిజ్ తోపాటు మీ ఆరోగ్యం
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి