AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Pak : ఐదుగురు బ్యాట్స్ మెన్, ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లు.. ఈ 11 మందితోనే టీమిండియా బరిలోకి దిగుతుందా?

యూఏఈపై భారత జట్టు ఘన విజయం సాధించిన తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి పాకిస్తాన్‌తో జరగబోయే హై-వోల్టేజ్ మ్యాచ్‌పై పడింది. సెప్టెంబర్ 14న జరిగే ఈ మహా పోరులో భారత జట్టులో ఏయే ఆటగాళ్లు ఉంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఒక కీలకమైన విషయాన్ని వెల్లడించాడు.

Ind vs Pak : ఐదుగురు బ్యాట్స్ మెన్, ముగ్గురు ఆల్ రౌండర్లు, ముగ్గురు బౌలర్లు.. ఈ 11 మందితోనే  టీమిండియా బరిలోకి దిగుతుందా?
India Vs Pakistan
Rakesh
|

Updated on: Sep 11, 2025 | 4:05 PM

Share

Ind vs Pak : యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు సులభంగా గెలిచిన తర్వాత, ఇప్పుడు అందరూ పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈసారి ఆదివారం కాదు, సూపర్‌ సండే కానుంది, ఎందుకంటే ఆసియా కప్లో పాకిస్థాన్, భారత జట్టుతో తలపడనుంది. సెప్టెంబర్ 14న జరగనున్న ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో ఎవరుంటారో ఇప్పటికే ఒక పెద్ద హింట్ లభించింది. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత జట్టులో 5 బ్యాట్స్‌మెన్, 3 ఆల్‌రౌండర్లు, 3 బౌలర్లు ఉంటారని తెలుస్తోంది.

పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ టీమ్ ఉంటుందా?

పాకిస్థాన్‌తో తలపడే భారత జట్టులో ఎవరు ఉంటారనే ప్రశ్నకు, మాజీ క్రికెటర్ అజయ్ జడేజా ఇచ్చిన సమాధానం ద్వారా తెలుస్తుంది. అజయ్ జడేజా ప్రకారం.. యూఏఈతో ఆడిన జట్టునే పాకిస్థాన్‌తో కూడా ఆడనుంది. అంటే జట్టులో ఎలాంటి మార్పులు ఉండవు. ఈ విషయాన్ని అజయ్ జడేజా భారత్ vs యూఏఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు సోనీ నెట్‌వర్క్ ఛానెల్‌లో మాట్లాడారు.

యూఏఈకి వ్యతిరేకంగా భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌పై అజయ్ జడేజా మాట్లాడుతూ.. “యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 మంది బ్యాటర్లను ఆడించకూడదు. కానీ, అలా ఆడిస్తే.. పాకిస్తాన్‌తో ఆడాల్సిన జట్టు అదే” అని అన్నారు. అంటే, యూఏఈ మీద ఆడిన జట్టునే పాకిస్థాన్‌ మీద కూడా ఆడిస్తారు.

భారత ప్లేయింగ్ ఎలెవన్ (అంచనా)

యూఏఈతో ఆడిన జట్టునే పాకిస్థాన్‌తో కూడా ఆడిస్తే, ఈ క్రింది విధంగా భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ ఉండవచ్చు.

బ్యాట్స్‌మెన్:

శుభ్‎మన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్)

ఆల్‌రౌండర్లు:

హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్

బౌలర్లు:

కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్