ఐపీఎల్ తన్ని తరిమేసింది.. కట్ చేస్తే.. 9 ఫోర్లు, 5 సిక్సర్లతో బౌలర్ల నడ్డి విరిచాడు.. ఎవరీ ప్లేయర్.?
ఐపీఎల్ తన్ని తరిమేసింది.. కానీ విదేశీ టోర్నీలలో మాత్రం తన సత్తా చాటాడు. ఇది అటుంచితే కెప్టెన్ గా మాత్రం విఫలమయ్యాడు. ఆడిన 4 మ్యాచ్ లలోనూ ఓటమిపాలై.. పేలవ ప్రదర్శన కనబరిచింది. మరి ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా. ఓ సారి లుక్కేయండి.

ప్రపంచంలోనే రిచ్చెస్ట్ క్రికెట్ లీగ్ అంటేనే ఠక్కున మైండ్‌లోకి వచ్చేది ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్). ఈ లీగ్‌లో ఆడాలని ప్రతీ విదేశీ ప్లేయర్ ఉవ్విళ్ళూరుతుంటారు. అయితే ఇంగ్లాండ్ ప్లేయర్స్ మాత్రం కొంచెం డిఫెరెంట్. తమ దేశానికే ప్రాతినిధ్యం ఇస్తామని.. అదే మా ఫస్ట్ ప్రయారిటీ అంటూ వేలంలో అమ్ముడుపోయినా లీగ్ నుంచి అడ్డంగా వైదోలుగుతుంటారు. ఆ కోవకు చెందిన ప్లేయర్ ఇంగ్లాండ్ మాజీ ఓపెనర్ జాసన్ రాయ్. ప్రస్తుతం ఐపీఎల్‌లో జాసన్ రాయ్‌పై రెండేళ్ల బ్యాన్ ఉంది. అయితే మనోడు విదేశీ లీగ్స్‌లో మాత్రం తన సత్తా చాటుతున్నాడు.
ప్రస్తుతం అబుదాబీ వేదికగా టీ10 లీగ్ జరుగుతోంది. ఇందులో జాసన్ రాయ్ రాయల్ చాంప్స్ తరపున బరిలోకి దిగాడు. అంతేకాదు ఆ జట్టుకు సారధ్య బాధ్యతలు కూడా చేపట్టాడు. పలు మ్యాచ్‌లలో కెప్టెన్ ఇన్నింగ్స్‌లు ఆడాడు గానీ.. తన జట్టుకు విజయాలు అందించడంలో విఫలమయ్యాడు. మొత్తంగా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో 96 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతడి స్ట్రైక్ రేటు 162.71గా ఉంది. ఈ విధ్వంసకర ఓపెనర్ బ్యాట్‌తో తన ప్రతాపం చూపించినా.. కెప్టెన్‌గా విఫలమయ్యాడు. రాయల్ చాంప్స్ ఆడిన 4 మ్యాచ్‌లలో అన్నింటా ఓడిపోయి.. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. కాగా, జాసన్ రాయ్ గతంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే.
