Gautam Gambhir : మా దగ్గర కోచ్ ఉద్యోగం ఖాళీ లేదు.. గౌతమ్ గంభీర్ కోచింగ్ పై ఐస్‌లాండ్ క్రికెట్ దారుణమైన సెటైర్!
భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్ ప్రదర్శన బాగా లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల పరంపరలో ఐస్‌లాండ్ క్రికెట్ కూడా పాలుపంచుకుంది. తమ X ఖాతాలో.. అభిమానుల సందేహాలు నివృత్తి చేస్తున్నాం. మా దేశానికి కోచ్‌గా ఉండటానికి గంభీర్‌ను పిలవడం లేదు.

Gautam Gambhir : భారత జట్టు ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్ టెస్ట్ క్రికెట్ ప్రదర్శన బాగా లేకపోవడంతో ప్రపంచవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శల పరంపరలో ఐస్‌లాండ్ క్రికెట్ కూడా పాలుపంచుకుంది. తమ X ఖాతాలో.. అభిమానుల సందేహాలు నివృత్తి చేస్తున్నాం. మా దేశానికి కోచ్‌గా ఉండటానికి గంభీర్‌ను పిలవడం లేదు. మా కోచ్ చాలా మంచివారు. మా జట్టు 2025లో 75% మ్యాచ్‌లు గెలిచింది అని వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. గంభీర్ టెస్ట్ సమస్యలు ఇప్పుడు దేశంలోనే కాక, ప్రపంచవ్యాప్తంగా జోక్‌గా మారాయని ఈ పోస్ట్ స్పష్టం చేసింది.
2024 మధ్యలో భారత జట్టు కోచ్‌గా గంభీర్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అతని టెస్ట్ రికార్డు ప్రశ్నార్థకంగా మారింది. అతని కోచింగ్‌లో భారత్ 12 ఏళ్లలో మొదటిసారిగా స్వదేశంలో న్యూజిలాండ్‌పై 0-3 వైట్‌వాష్‌తో ఓడిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని 1-3 తేడాతో కోల్పోయింది. గణాంకాలు చూస్తే గంభీర్ ఆధ్వర్యంలో ఆడిన 18 టెస్ట్ మ్యాచ్‌లలో భారత్ కేవలం 7 విజయాలు, 9 ఓటములు నమోదు చేసింది. ప్రస్తుతం సౌతాఫ్రికా సిరీస్‌లో కూడా దాదాపు ఓటమి అంచున ఉంది.
To all our fans, no, Gautam Gambhir will not be invited to be our new national team coach. That position is already filled and we won 75% of our matches in 2025.
— Iceland Cricket (@icelandcricket) November 24, 2025
ఈ వరుస ఓటములకు కారణం సరైన ఆటగాళ్ల ఎంపిక లేకపోవడం, గందరగోళమైన వ్యూహాలు, బ్యాట్స్‌మెన్ల దూకుడు ఆట అని విమర్శకులు ఆరోపిస్తున్నారు. స్వదేశంలో, విదేశాల్లో జట్టు పదేపదే తక్కువ స్కోర్‌లకే ఆలౌట్ అవ్వడం, అలాగే స్థిరమైన ఫలితాలు రాకపోవడం గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై సందేహాలను పెంచుతున్నాయి. టెస్ట్ క్రికెట్‌లో గంభీర్ రికార్డు అంత బాగోలేకపోయినా, వన్డే, టీ20 ఫార్మాట్‌లో మాత్రం అతని కోచింగ్ అద్భుతంగా పనిచేసింది. అతని ఆధ్వర్యంలో భారత్ కేవలం తొమ్మిది నెలల వ్యవధిలో ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ టైటిళ్లను గెలుచుకుంది. ఈ టైటిల్ విజయాలు, టెస్ట్ వైఫల్యాలపై వచ్చిన విమర్శలను కొంతవరకు తగ్గించాయి.
75% విజయాల రేటు ఉన్న ఒక చిన్న క్రికెట్ బోర్డు (ఐస్‌లాండ్), ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జట్టు కోచ్‌ను బహిరంగంగా ఎగతాళి చేస్తోందంటే, గంభీర్ టెస్ట్ క్రికెట్‌లో ఉన్న స్థానం ఎంత బలహీనంగా ఉందో అర్థమవుతోంది. ఐస్‌లాండ్ ట్వీట్ ఒక జోక్ అయినప్పటికీ గంభీర్ కోచింగ్‌లో భారత టెస్ట్ ప్రదర్శన పతనం ప్రపంచ క్రికెట్ దృష్టిలో ఒక పెద్ద కామెడీగా మారిందనే విషయాన్ని అది సూచిస్తుంది. ఈ విమర్శలకు, ట్రోలింగ్‌కు గంభీర్ ఇవ్వగలిగే ఏకైక సమాధానం.. మంచి ఫలితాలు సాధించడం, విమర్శకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా స్కోర్‌బోర్డ్‌ను మార్చడం ఒక్కటే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
