“150 kmph స్పీడ్ సరిపోలే.. ఇంకా వేగంగా బౌలింగ్ చేయండి”: కావ్యమారన్ ఖతర్నాక్ ప్లేయర్ సీక్రెట్ ఇదే
Abhishek Sharma: సాధారణంగా యువ క్రికెటర్లు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత వేగానికి అలవాటుపడతారు. కానీ, రాజ్‌కుమార్ శర్మ తన కుమారుడు అభిషేక్ కోసం ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరించారు. అతను కేవలం 16 ఏళ్ల వయసులో ఉండగానే, ఆ సమయంలో 135-140 kmph వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ల వద్దకు తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయించేవారు.

భారత క్రికెట్‌లో యువ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన అభిషేక్ శర్మ, చిన్న వయసులోనే స్పీడ్ బౌలింగ్‌ను ఎదుర్కొని అద్భుతంగా రాణించడం వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. అతని తండ్రి, కోచ్ రాజ్‌కుమార్ శర్మ, అభిషేక్ కేవలం 16 ఏళ్లు రాకముందే 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొనేలా ఎలా సిద్ధం చేశారో ఇటీవల వివరించాడు.
సాధారణంగా యువ క్రికెటర్లు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత వేగానికి అలవాటుపడతారు. కానీ, రాజ్‌కుమార్ శర్మ తన కుమారుడు అభిషేక్ కోసం ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అనుసరించారు. అతను కేవలం 16 ఏళ్ల వయసులో ఉండగానే, ఆ సమయంలో 135-140 kmph వేగంతో బౌలింగ్ చేసే బౌలర్ల వద్దకు తీసుకెళ్లి ప్రాక్టీస్ చేయించేవారు. అయితే, రాజ్‌కుమార్ ఆ కోచ్‌తో “వాళ్లతో ఇంకా వేగంగా బౌలింగ్ చేయించండి” అని చెప్పేవారు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది.
భారత జట్టు మాజీ ఓపెనర్, ప్రస్తుతం సెలెక్టర్ అయిన శ్రీకాంత్, 150kmph వేగంతో బంతులను ఎదుర్కోవడానికి ప్రాక్టీస్ చేయమని ఒకసారి అభిషేక్‌కు సలహా ఇచ్చారట. ఈ సలహానే రాజ్‌కుమార్ శర్మకు ప్రేరణగా నిలిచింది. ఫాస్ట్ బౌలింగ్‌కు అలవాటుపడటం ద్వారా, అంతర్జాతీయ స్థాయిలో వచ్చే బౌలర్లను సులభంగా ఎదుర్కోవచ్చని శ్రీకాంత్ చెప్పారట.
అప్పటినుంచి రాజ్‌కుమార్ శర్మ, 135-140 kmph వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లను తీసుకెళ్లి అభిషేక్‌తో ప్రాక్టీస్ చేయించేవారు. “ఆ వేగానికి అలవాటుపడండి, ఆ వేగంతో వచ్చే బంతులను ఎదుర్కోవడం వల్ల మీ టైమింగ్, రిఫ్లెక్స్ మెరుగవుతాయి” అని ఆయన అభిషేక్‌కు సూచించారు. ప్రారంభంలో అభిషేక్ కాస్త ఇబ్బంది పడినప్పటికీ, క్రమంగా ఆ వేగానికి అలవాటుపడ్డాడు. ఇది అతని బ్యాటింగ్ టెక్నిక్‌ను, టైమింగ్‌ను గణనీయంగా మెరుగుపరిచింది.
ప్రస్తుతం, ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్న అభిషేక్ శర్మ, తన దూకుడు బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా, అతను ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొనే విధానం, వారి బౌలింగ్‌లో బౌండరీలు సాధించడం చూస్తే, చిన్న వయసులో అతను చేసిన ఆ కఠిన ప్రాక్టీస్ ఎంత ఉపయోగపడిందో అర్థమవుతుంది. ఈ ప్రత్యేక శిక్షణ వల్లనే, అభిషేక్ తన 16 ఏళ్ల వయసు నుంచే ఏ బౌలర్‌నైనా, ఏ వేగాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఇక తాజాగా ఆసియా కప్ 2025లోనూ తుఫాన్ వేగంతో బౌలర్లపై విరుచుకపడుతున్నాడు. స్కోర్ వేగాన్ని బుల్లెట్ రైలులా తీసుకెళ్లడంతో సహాయపడుతున్నాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








