AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కావ్యపాప ప్లేయర్ పెను విధ్వంసం.. 8 ఫోర్లు, 16 సిక్సర్లతో ఇదేం ఊచకోతరా బాబూ..!

Abhishek Sharma Half Century: 2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌పై పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అతని తుఫాన్ ఇన్నింగ్స్ అతని గురువు యువరాజ్ సింగ్ రికార్డును సమం చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో అభిషేక్ వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడ్డాడు.

కావ్యపాప ప్లేయర్ పెను విధ్వంసం.. 8 ఫోర్లు, 16 సిక్సర్లతో ఇదేం ఊచకోతరా బాబూ..!
Abhishek Sharma
Venkata Chari
|

Updated on: Nov 30, 2025 | 11:27 AM

Share

Abhishek Sharma Half Century: సయ్యద్ ముష్తాక్ అలీ 2025 ట్రోఫీలో, పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్ ప్రపంచంలో తుఫాన్ స‌ృష్టించాడు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారాడు. బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో, అభిషేక్ అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా చరిత్ర సృష్టించాడు. విశేషమేమిటంటే, అతను ఒక్క పరుగు కూడా చేయకుండా కేవలం ఫోర్లు, సిక్సర్లు కొట్టడం ద్వారా 50 పరుగులు సాధించాడు. దీంతో, అతను తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు.

అభిషేక్ శర్మ అద్భుతమైన అర్ధ శతకం..

పంజాబ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ కేవలం 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేశాడు. ఇది టీ20 క్రికెట్ చరిత్రలో ఉమ్మడిగా మూడవ వేగవంతమైన అర్ధ సెంచరీగా నిలిచింది. 2007లో 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించడం ద్వారా తన గురువు యువరాజ్ సింగ్ రికార్డును సమం చేశాడు. అర్ధ సెంచరీకి చేరుకునే మార్గంలో అతను 5 ఫోర్లు, 5 సిక్సర్లు కూడా కొట్టాడు. అంటే అతను బౌండరీల ద్వారా మాత్రమే 50 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీ తర్వాత తుఫాన్ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయిన అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 52 బంతుల్లో 8 ఫోర్లు, 16 సిక్స్‌లతో 148 పరుగులు చేశాడు. దీంతో పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి 310 పరుగులు చేసింది.

2025 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అభిషేక్ శర్మ చేసిన విధ్వంసక ఇన్నింగ్స్ ఇప్పుడు అతన్ని వైభవ్ శర్మతో కలిపి ఓ రికార్డులో చేర్చిందిఅభిషేక్ కేవలం 32 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఫోర్లు, 11 అద్భుతమైన సిక్సర్లు బాదాడుఅతని స్ట్రైక్ రేట్ 321.88గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

ఇది అభిషేక్ 35 బంతుల్లో లేదా అంతకంటే తక్కువ సమయంలో చేసిన రెండవ టీ20 సెంచరీగా నిలిచిందిగత సంవత్సరం ఇదే టోర్నమెంట్‌లో , అతను 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇప్పుడువైభవ్ సూర్యవంశీతో పాటు, ఇంత వేగంగా రెండు టీ20 సెంచరీలు సాధించిన ప్రపంచంలో రెండవ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 148 పరుగులు చేశాడు. దీనికి అతను 52 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లు, 16 సిక్సర్లు బాదాడు.

దోహాలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో జరిగిన 2025 ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో తన మొదటి మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 32 బంతుల్లో సెంచరీ సాధించాడు. అతను 42 బంతుల్లో మొత్తం 144 పరుగులు చేశాడు. గతంలో, అతను ఐపీఎల్ 2025లో గుజరాత్ జట్టుతో ఆడుతూ 35 బంతుల్లో సెంచరీ చేశాడు.

2007లో యువరాజ్ సింగ్ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. టీ20 ప్రపంచ కప్ సందర్భంగా ఇంగ్లాండ్‌పై ఈ ఘనత సాధించాడు. అలాగే, స్టువర్ట్ బ్రాడ్‌పై ఆరు బంతుల్లోనే ఆరు సిక్సర్లు బాదాడు. ఈ గురు-శిష్యుల కలయిక సినిమా కథ కంటే తక్కువేం కాదు. యువరాజ్ ఒకప్పుడు భారత బ్యాట్స్‌మెన్స్ ఎంత నిర్భయంగా ఉండగలరో ప్రపంచానికి చూపించాడు. ఇప్పుడు అభిషేక్ ఆ దూకుడును తదుపరి తరానికి ముందుకు తీసుకెళ్తున్నాడు.

పంజాబ్ దూకుడు..

ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ పంజాబ్‌కు బలమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతని విధ్వంసక ఇన్నింగ్స్ పవర్‌ప్లేలో పంజాబ్ వికెట్ కోల్పోకుండా 93 పరుగులు చేయడంలో సహాయపడింది. దక్షిణాఫ్రికాతో టీమిండియా త్వరలో టీ20 సిరీస్ ఆడనుందని గమనించాలి. కాబట్టి, అభిషేక్ ఫామ్ భారత జట్టుకు శుభసూచకం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..