ICC World Cup 2023 India Schedule: 10 టీంలు.. 46 రోజులు.. 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు.. ప్రపంచ కప్ షెడ్యూల్‌లో పాక్‌కు భారీ షాక్..

World Cup 2023 Schedule: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది.

ICC World Cup 2023 India Schedule: 10 టీంలు.. 46 రోజులు.. 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు.. ప్రపంచ కప్ షెడ్యూల్‌లో పాక్‌కు భారీ షాక్..
Ind Vs Pak Match
Follow us
Venkata Chari

|

Updated on: Jun 27, 2023 | 1:16 PM

World Cup 2023 Schedule: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదలైంది. అక్టోబరు 5 నుంచి ప్రపంచకప్ ప్రారంభం కానుండగా, ఫైనల్ మ్యాచ్ అహ్మదాబాద్‌లో జరగనుంది. 46 రోజుల పాటు జరిగే ఈ టోర్నీ మొత్తం 10 వేదికల్లో 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ గురించి 5 కీలక విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

వన్డే ప్రపంచకప్‌లో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనుంది. అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో పాకిస్థాన్‌తో భారత జట్టు పోటీపడనుంది.

ఐసీసీ షెడ్యూల్‌ నుంచి పాకిస్థాన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పాకిస్థాన్ తన రెండు మ్యాచ్‌ల వేదికను మార్చాలని డిమాండ్ చేసింది. చెన్నైలో ఆఫ్ఘనిస్థాన్‌, బెంగళూరులో ఆస్ట్రేలియాతో ఆడేందుకు పాకిస్తాన్ ఇష్టపడలేదు. అంతే కాదు అహ్మదాబాద్‌లో భారత్‌తో తలపడేందుకు పీసీబీ కూడా సిద్ధంగా లేకపోయినా ఐసీసీ మాత్రం పాక్ వినతిని పట్టించుకోలేదు.

ఇవి కూడా చదవండి

ఐసీసీ ప్రపంచ కప్ 2023 చివరిసారి లాగే రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో నిర్వహించనున్నారు. మొత్తం 10 జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో మొత్తం 9 లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో టాప్ 4 జట్లు సెమీ ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

వన్డే ప్రపంచకప్‌లో తొలి సెమీఫైనల్ నవంబర్ 15న ముంబైలో, రెండో సెమీఫైనల్ నవంబర్ 16న కోల్‌కతాలో జరగనుంది. నవంబర్ 19న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ప్రపంచ కప్ సెమీ ఫైనల్స్, ఫైనల్స్ కోసం రిజర్వ్ డే ఉంచారు. ఒకవేళ వర్షం లేదా మరేదైనా కారణాల వల్ల, ఈ నాకౌట్ మ్యాచ్‌లను నిర్ణీత రోజున నిర్వహించలేకపోతే, మరుసటి రోజు నిర్వహిస్తారు. అన్ని నాకౌట్ మ్యాచ్‌లు డే అండ్ నైట్‌లుగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారంర అన్ని మ్యాచ్‌లు మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభమవుతాయి.

ప్రపంచ కప్ 2023లో టీమిండియా షెడ్యూల్ ఇదే..

అక్టోబర్ 8 – భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా, చెన్నై

అక్టోబర్ 11 – ఇండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్, ఢిల్లీ

అక్టోబర్ 15- భారత్ వర్సెస్ పాకిస్థాన్, అహ్మదాబాద్

అక్టోబర్ 19 – భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, పూణే

అక్టోబర్ 22 – భారత్ వర్సెస్ న్యూజిలాండ్, ధర్మశాల

అక్టోబర్ 29 – భారత్ వర్సెస్ ఇంగ్లండ్, లక్నో

నవంబర్ 2 – భారత్ వర్సెస్ క్వాలిఫైయర్, ముంబై

నవంబర్ 5 – భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా, కోల్‌కతా

నవంబర్ 11 – భారత్ వర్సెస్ క్వాలిఫైయర్స్, బెంగళూరు

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
గురువుకి రెట్టింపు బలం.. ఆ రాశుల వారికి కనక వర్షం పక్కా..!
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
మీరు డ్రైవింగ్‌లో అంబులెన్స్‌కు దారి ఇవ్వకుంటే ఏమవుతుందో తెలుసా?
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
ఇదో రకం పిచ్చి..! అగ్నిపర్వతం లావాతో సిగరెట్‌ వెలిగించుకోవాలని
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు