World Cup 2023, Team India: 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీలో మొండిచేయి.. 2011 మ్యాజిక్ రిపీటయ్యేనా?

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే గత 10 ఏళ్లుగా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. 2013లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన టీమిండియా ఆ తర్వాత విఫలమైంది. గత పదేళ్లలో భారత్ 9 ఐసీసీ టోర్నీల్లో ఓడిపోయింది.

World Cup 2023, Team India: 10 ఏళ్లుగా ఐసీసీ టోర్నీలో మొండిచేయి.. 2011 మ్యాజిక్ రిపీటయ్యేనా?
Team India 2023 World Cup
Follow us
Venkata Chari

|

Updated on: Jun 27, 2023 | 12:51 PM

Cricket World Cup 2023 Fixtures: ఐసీసీ ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ ఎట్టకేలకు విడుదలైంది. ఈ టోర్నీ అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో న్యూజిలాండ్ తలపడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇరు జట్లు తలపడనున్నాయి. ప్రపంచ కప్ 2023 ఫైనల్ పోరు నవంబర్ 19న జరగనుంది. ఈ టైటిల్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.

ఆస్ట్రేలియాతో టీమిండియా తొలిపోరు..

అదే సమయంలో, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరగనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో టీమిండియా తన చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. అక్టోబర్ 29న లక్నోలోని ఎకానా స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

గత 10 ఏళ్లలో ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉందంటే..

ఐసీసీ టోర్నీల్లో టీమిండియా మంచి ప్రదర్శన కనబరిచింది. అయితే గత 10 ఏళ్లుగా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది. 2013లో చివరిసారిగా ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచిన టీమిండియా ఆ తర్వాత విఫలమైంది. గత పదేళ్లలో భారత్ 9 ఐసీసీ టోర్నీల్లో ఓడిపోయింది. అందులో 4 సార్లు టైటిల్ మ్యాచ్‌లో ఓటమిపాలైంది.

ఇవి కూడా చదవండి
  1. 2014లో టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోయింది.
  2. 2015 ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్స్‌లో టీమిండియా ఓడిపోయింది.
  3. 2016 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయింది.
  4. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో టీమిండియా ఓడిపోయింది.
  5. 2019 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌లో టీమిండియా మరోసారి ఓటమిపాలై, ఇంటి బాట పట్టింది.
  6. 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత్ లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
  7. 2021 ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా ఫైనల్‌లో ఓడిపోయింది.
  8. 2022 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు సెమీ ఫైనల్స్‌లో ఓడిపోయింది.
  9. 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి పాలైంది.

ఇటువంటి పరిస్థితిలో భారత క్రికెట్ జట్టు అభిమానులు రోహిత్ & కో ఈ పరాజయాల పరంపరను స్వదేశంలో ముగించాలని ఆశిస్తున్నారు. ఈసారి టోర్నీ భారత్‌లోనే జరగడంతో టీమిండియాకు కూడా అవకాశాలు పుష్కలంగా ఉండనున్నాయి. 2011లో టీమిండియా స్వదేశంలో జరిగిన ప్రపంచ కప్ టోర్నీలో ప్రపంచ విజేతగా నిలిచింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..